MoviesTollywood news in telugu

‘ప్రాజెక్ట్‌ K’ నటీనటుల రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా…?

Remuneration of project K Actors: ప్రభాస్,దీపికా పదుకునే హీరో హీరోయిన్ లుగా వస్తున్న ‘ప్రాజెక్ట్‌ K’ సినిమా గురించి ఒక వార్త సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తుంది. ఈ సినిమాను 5౦౦ కోట్ల బడ్జెట్‌తో వైజయంతి మూవీస్‌ చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌ వంటి అ‍గ్ర హీరోలు నటిస్తున్నారు.

సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాలో నటిస్తున్న నటీనటుల రెమ్యూనరేషన్‌ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రభాస్‌ 150 కోట్ల రూపాయలు, దీపికా పదుకునే 10 కోట్ల రూపాయలు, కమల్‌ హాసన్‌ 20 కోట్ల రూపాయలు, అమితాబ్‌ బచ్చన్‌ 15 కోట్ల రూపాయలు.. హీరోయిన్‌ దిశా పఠానీ 5 కోట్ల రూపాయలు తీసుకున్నారని సమాచారం.