బంగాళాఖాతంలో అల్పపీడనం, జోరుగా రుతుపవనాలు…భారీ వర్ష సూచన
Southwest Monsoon ::తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసేందుకు అనుకూలమైన వాతావరణం ఉందని అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడనం, జోరుగా రుతుపవనాలు బాగా కలిసి వచ్చే అంశాలు. మండే ఎండల నుంచి కాస్త ఉపశమనం కలిగినట్టే. రెండు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారి గాలుల్లో చల్లదనం బాగా పెరిగింది.
సోమవారం, మంగళవారం తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వర్షాకాలం వస్తే హైదరాబాదులో చల్లదనం పెరుగుతుంది. హైదరాబాదులో భారీ వర్షాలు కురుస్తూ ఉండటం వలన ఈరోజు, రేపు కూడా హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాలు కాస్త అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. దీని కారణంగా మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ లో కూడా రెండు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు, రేపు, ఎల్లుండి మూడు రోజులు వాతావరణం ఇలాగే ఉంటుందని వర్షాలు పడతాయని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. దక్షిణ కోస్తా, రాయలసీమ, ఆంధ్రలో అక్కడక్కడ ఉరుములతో కూడిన మెరుపులతో కూడిన వర్షాలు వస్తాయని కాస్త జాగ్రత్తగా ఉండాలని, జాలర్లు చేపల వేటకు వెళ్ళద్దని సూచించారు.