MoviesTollywood news in telugu

అల్లు అర్జున్ నెల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.. ?

Allu Arjun: అల్లు అరవింద్ కొడుకుగా సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన అల్లు arjun చాలా తక్కువ సమయంలోనే తనకంటూ సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయికి ఎదిగాడు. ఇక ఇప్పుడు పుష్ప 2 తో బిజీగా ఉన్నాడు. ఒక వైపు సినిమాలలో నటిస్తూ మరోవైపు బిజినెస్ చేస్తున్నాడు.
Tollywood Star Allu arjun
అల్లు అర్జున్ చేసే బిజినెస్ ల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. తన తాతయ్య అల్లు రామలింగయ్య స్మారకార్థం అల్లు అర్జున్ అల్లు స్టూడియోని ఏర్పాటు చేశారు. అలాగే ఆహా ( Aaha ) ఓటిటి ప్లాట్ ఫాం కూడా ఏర్పాటు చేసి సక్సెస్ అయ్యారు. దీనిలో ఎన్నో రకాల సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లో పలు షోలను నిర్వహిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు.
Tollywood Hero Allu Arjun
అల్లు అర్జున్ ఏషియన్ వారితో ఏషియన్ అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ ( AAA Multiplex ) థియేటర్ ని కూడా ప్రారంభించాడు. అలాగే వైల్డ్ వింగ్స్ బఫే అనే బార్ అండ్ రెస్టారెంట్ కూడా నడుపుతున్నారు.ఇక్కడ food బాగుంటుందని పెద్ద ఎత్తున బిజినెస్ జరుగుతుంది. అలా నెలకు బిజినెస్ ల ద్వారానే కోట్లలో ఆదాయాన్ని పొందుతున్నాడు.