టమాటా రేటు పెరిగిందని టెన్షన్ పడుతున్నారా.. బదులుగా వీటిని వాడితే..రుచి బాగుంటుంది
Tomato Alternatives: టమాటా వంటలకు రుచిని ఇస్తుంది. గత కొన్ని రోజులుగా టమాటాల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. టమాటా అనేక వంటకాలకు పులుపుని చేర్చడానికి అలాగే రుచిని పెంచటానికి సహాయపడుతుంది. టమాటా ధర పెరిగిందని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. టమాటాకు బదులుగా వంటలను పులుపు మరియు రుచికరంగా మార్చే కొన్ని పదార్థాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పే పదార్థాలు టమాటా కన్నా చాలా చౌకగా దొరుకుతాయి.
ఉసిరికాయను టమాటాకు బదులుగా వాడవచ్చు. ఉసిరికాయలు సీజన్లో దొరికినప్పుడు ఉసిరికాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మెత్తని పొడిగా చేసి బాగా ఎండబెట్టి నిలువ చేసుకోవచ్చు. లేదంటే ఉసిరి పొడి మార్కెట్లో లభ్యమవుతుంది. ఉసిరికాయలో పోషకాలు చాలా ఉన్నాయి. మనం కూరలు చేసినప్పుడు టమాటాకు బదులు ఉసిరికాయ వాడవచ్చు.
కూరలు చేసినప్పుడు టమాటా లేకపోతే టమోటాకి బదులుగా చింతపండు రసాన్ని కలపవచ్చు. కూరగాయలతో కలిసినప్పుడు చింతపండు రుచి ఆ కూరకు రెట్టింపు రుచిని అందిస్తుంది.
పచ్చి మామిడిని కూడా టమాటాకు బదులుగా కూరలలో వాడవచ్చు. కూర పుల్లగా చేయడానికి పచ్చిమామిడి చాలా బాగా సహాయపడుతుంది. సీజన్ లో దొరికినప్పుడు పచ్చి మామిడిని వాడవచ్చు. సీజన్ కానప్పుడు మామిడికాయలను కోరి బాగా ఎండబెట్టి నిలువ చేసుకుని వాడవచ్చు.
నిమ్మకాయను కూరలో పులుపు కోసం టమాటాకు బదులుగా వాడవచ్చు. నిమ్మకాయలు సంవత్సరం పొడవునా విరివిగానే లభ్యమవుతాయి. అంతేకాకుండా చాలా చవకగా లభ్యమవుతాయి. విటమిన్ సి తో సహా ఎన్నో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.