తెలుగు స్టార్ హీరోల ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Star Heroes First remuneration:టాలీవుడ్ స్టార్ హీరోలు సినిమాల్లో నటించి కోట్ల రూపాయలను సంపాదిస్తుంటారు. స్టార్ హీరోలకు ఎంతో మంది అభిమానులు ఉంటారు. హీరోల గురించిన ప్రతి విషయం తెలుసుకోవటానికి ప్రతి అభిమాని చాలా ఆసక్తిగా ఉంటాడు. అయితే మన స్టార్ హీరోలు వారి మొదటి సినిమాలో తీసుకున్న ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసుకుందాం.
విజయ్ దేవరకొండ సినిమాల్లోకి రాకముందు ట్యూషన్లు చెప్పేవాడు. అందుకుగాను మొదట విజయ్ దేవరకొండ తీసుకున్న పారితోషికం 500 రూపాయలు. అయితే నటించిన మొదటి సినిమా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, నువ్విలా వంటి సినిమాలలో అసలు రెమ్యూనరేషన్ తీసుకోలేదు.
అల్లు అర్జున్ తన మొదటి సినిమాలో నటించినందుకు కేవలం వంద రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ ఒక్క సినిమాకి 80 కోట్ల పైనే తీసుకుంటున్నాడు.
జూనియర్ ఎన్టీఆర్ మొదటి సినిమాలో నాలుగు లక్షల రూపాయల రెమ్యూనరేషన్ పొందాడు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు 100 కోట్లకు పైన తీసుకుంటున్నాడు.
పవన్ కళ్యాణ్ మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో నటించినందుకు ఐదు లక్షల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు.
మహేష్ బాబు బాల నటుడిగా ఇండస్ట్రీలో చాలా సినిమాలలో నటించాడు. అయితే హీరోగా మొదటి సినిమా రాజకుమారుడులో నటించినందుకు ఐదు నుంచి పది లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు.
ప్రభాస్ మొదటి సినిమా ఈశ్వర్ లో నటించినందుకు ఐదు లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు.
ఇక మెగాస్టార్ చిరంజీవి తన మొదటి సినిమాలో నటించినందుకు 1116 మాత్రమే తీసుకున్నాడట. ఇక ప్రస్తుతం ఒక్క సినిమాలో నటించేందుకు 50 కోట్ల రూపాయలను తీసుకుంటున్నాడు.