నేరేడు పండు తింటున్నారా… తినే ముందు ఒక్కసారి ఈ నిజాలు తెలుసుకోండి
Health Benefits of Jamun fruit in Telugu : చూడడానికి నల్లగా.. తినేటప్పుడు కొంచెం చేదుగా, పులుపుగా ఉండే పండు నేరేడు పండు. దీనిని ఇంగ్లిష్ లో జామున్ అంటారు. నేరేడులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఈ పండ్లలో సోడియం, పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్, మాంగనీస్, ఐరన్, విటమిన్ సి, ఫోలిక్ ఆమ్లం వంటి విటమిన్స్ అధిక మోతాదులో లభిస్తాయి.
నేరేడులో విటమిన్ సి సమృద్ధిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా చేస్తుంది. నేరేడులో ఐరన్
పుష్కలంగా ఉంటుంది. శరీరానికి ఎంతో అవసరమైన హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి సాయం చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయడంలోనూ దీని పాత్ర చాలా కీలకమైనది. ఈ పండ్లను తినటం వలన జీవక్రియ రేటు పెరిగి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి అజీర్ణ సమస్యలు తగ్గుతాయి.
మధుమేహం ఉన్న వారికి నేరేడు పండు మంచి దివ్య ఔషధం అని చెప్పవచ్చు . దీనిని ప్రతి రోజు క్రమం తప్పకుండా రోజూ తింటే రక్తంలోని చక్కెర శాతం క్రమబద్ధమవుతుంది. నేరేడు పండ్లలో అతి తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల మధుమేహం ఉన్నవారికి చాలా మంచిది. మధుమేహం ఉండేవారిలో తరచూ దాహం వేయడం, మూత్రానికి పోవడం వంటి సమస్యలు ఉంటాయి. అవి కూడా అదుపులో ఉంటాయి.
ఇది మంచి యాంటీ డయాబెటిక్ గా పనిచేస్తుంది.నేరేడు పండ్లులో పొటాషియం కంటెంట్ సమృద్ధిగా ఉంటుంది . 100 గ్రాముల పండ్లలో 55mg ల పొటాషియం ఉంటుంది. పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. దాంతో గుండె పనితీరు మెరుగ్గా ఉండి గుండె సమస్యలు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. కాబట్టి ప్రతి రోజు రెండు నేరేడు పండ్లను తింటే మంచిది.
నేరేడు పండ్లలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల వల్ల దంత సమస్యలను నివారించే అనేక మందుల్లో వీటిని విరివిగా ఉపయోగిస్తున్నారు. నేరేడు పళ్లను రెగ్యులర్ గా తింటే పళ్లు, చిగుళ్లు బలంగా ఉంటాయి. వేసవిలో శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా కాపాడుతుంది. అంతేకాక దాహాన్ని కూడా నియంత్రిస్తుంది. నేరేడు చర్మ సంరక్షణలో కూడా సహాయపడుతుంది.
నేరుడు గింజలను పొడిగా చేసి, ఆ పొడిలో పాలను కలిపి పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని ముఖానికి రాసి అరగంట అయ్యాక శుభ్రం చేసుకుంటే మొటిమల సమస్య మరియు మొటిమల కారణంగా వచ్చే మచ్చలు కూడా తొలగిపోతాయి. నేరేడులో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన వృద్దాప్య లక్షణాలను ఆలస్యం చేస్తుంది. దాంతో చర్మం యవ్వనంగా ఉంటుంది.
నేరేడులో విటమిన్ A,C లు ఉండుట వలన చర్మ,కంటి ఆరోగ్యంలో సహాయపడతాయి. నేరేడులో ఉండే క్యాల్షియం ఎముకలు బలంగా ఉండేలా చేస్తుంది. ఒక స్పూన్ జామున్ జ్యూస్ లో, తేనె, ఉసిరి పొడి వేసి బాగా కలిపి ప్రతి రోజూ ఉదయం తీసుకుంటే బ్రెయిన్ పవర్ పెరుగుతుంది. పూర్వకాలంలో గాయాలను నయం చేయడానికి నేరేడు ఆకులను వాడేవారు.
ఈ ఆకులలో యాంటిబ్యాక్టీరియల్, నయం చేసే గుణాలు అధికంగా ఉన్నాయి.కాలేయం పనితీరు క్రమబద్ధీకరించడానికి లేదా శుభ్రపరచడానికి నేరేడు దివ్యౌషధంలా పనిచేస్తుందని కొన్ని అధ్యయనాలలో తేలింది. నేరేడులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కాలేయం పనితీరుని మెరుగు పరచడంలో సహాయపడతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.