పరగడుపున నిమ్మరసం తాగే ప్రతి ఒక్కరు మిస్ కావద్దు…నమ్మలేని నిజాలు
Lemon health Benefits:సాదారణంగా మనం ఉదయం లేవగానే మంచి రుచి మరియు వాసన కలిగిన కాఫీ త్రాగటం జరుగుతూ ఉంటుంది. అయితే కాఫీ త్రాగటాన్ని ఒక అర గంట వాయిదా వేసి కేవలం నిమ్మరసం త్రాగితే చాలా మంచిది.
క్యాన్సర్ కణాలను చంపే గుణాలు నిమ్మరసంలో ఉన్నాయి. కానీ మనవ శరీరంలో ఆల్కలీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటేనే ఉత్తమంగా పనిచేస్తుంది. ఆమ్ల పండుగా ప్రసిద్ది చెందిన నిమ్మకాయను గొప్ప ఆల్కలీన్ ఏజెంట్ గా చెప్పవచ్చు. నిమ్మరసం త్రాగినప్పుడు శరీరంలో ఆమ్ల స్థాయిలు తగ్గుతాయి. ఏదైనా ఆహారం తిన్నప్పుడు ఎసిడిక్ గా ఉన్నప్పుడు మరియు చర్మం యొక్క pH స్థాయిలను తగ్గించడానికి నిమ్మకాయ నీరు సహాయపడుతుంది.
విటమిన్లు మరియు ఖనిజాలు సమృద్దిగా ఉంటాయి
నిమ్మకాయలో యాంటి ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన రోగనిరోధక వ్యవస్థ అభివృద్ధిలో సహాయపడుతుంది. నిమ్మలో ఉండే విటమిన్ B శక్తి ఉత్పత్తి కోసం, రిబోఫ్లేవిన్ పెరుగుదలకు సహాయం, కాల్షియం వంటి ఖనిజాలు కణజాలం అభివృద్ధి మరియు మరమత్తు కోసం, మెగ్నీషియం మరియు ఫాస్పరస్ ఎముకలు మరియు దంతాల బలం కొరకు సహాయపడతాయి.
లివర్ శుద్దీకరణ
లివర్ అనేది శరీరంలో నిర్విషీకరణ చేసే ప్రధాన అవయవం. అలాగే లివర్ శరీరంలో ప్రోటీన్ మరియు జీర్ణక్రియకు అవసరమైన జీవ రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది. నిమ్మకాయ నీరు కాలేయ నిర్విషీకరణ చేసే ఎంజైమ్ల సంఖ్యను పెంచుతుంది. దాంతో కాలేయం దాని బాధ్యతలను మరింత ప్రతిభావంతంగా నిర్వహిస్తుంది. అంతేకాక నిమ్మ మంచి మలబద్దక నివారిణిగా పనిచేస్తుంది. దాంతో శరీరం శుద్ది జరిగి మూత్రవిసర్జన రేటు పెరగటానికి కూడా సహాయపడుతుంది.
ముడతలను తగ్గిస్తుంది
ప్రతి రోజు నిమ్మకాయ రసాన్ని వినియోగిస్తే ముడతలు తగ్గి చర్మం మంచి లుక్ తో ఉండటానికి సహాయపడుతుంది. అంతేకాక నిమ్మకాయ శరీరంలోని విషాలను బయటకు పంపటం వలన చర్మం ఆరోగ్యవంతంగాను మరియు ప్రకాశవంతంగాను ఉంటుంది. నిమ్మకాయ ముడుతల చికిత్స మరియు చర్మం ప్రకాశవంతంగా ఉండటానికి చౌకైన మరియు చాలా వరకు అందుబాటులో ఉండే నివారిణి అని చెప్పవచ్చు. నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉండుట వలన మొటిమలకు వ్యతిరేకంగా పోరాడటంలో సహాయం చేస్తుంది.
బరువు కోల్పోవటానికి సహాయపడుతుంది
కాలేయంలో విష పదార్థాలు మరియు వ్యర్థ ఉత్పత్తుల ప్రభావం జీవక్రియ మరియు కొవ్వు పెరగటం మీద ఉంటుంది. శరీరంలో వ్యర్ధ పదార్ధాలను తొలగించటానికి కాలేయంనకు నిమ్మకాయ నీరు సహాయం చేయుట వలన కొవ్వు తగ్గుతుంది. అయితే సరైన ఆహారం మరియు శారీరక శ్రమ ఉంటేనే బరువు తగ్గటంలో నిమ్మకాయ నీరు మద్దతు
ఇస్తుంది.
శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది
ఛాతీ ఇన్ ఫెక్షన్స్ కు చికిత్స మరియు దగ్గు తగ్గించటానికి నిమ్మకాయ నీరు సహాయపడుతుంది. ఉబ్బసం మరియు అలెర్జీ సమస్యలతో బాధ పడుతున్నవారికి నిమ్మకాయ నీరు మంచి చికిత్స అని చెప్పవచ్చు. అంతేకాక నిమ్మకాయలో సిట్రిక్ ఆమ్లం ఎక్కువగా ఉండుట వలన చెడు శ్వాస, చిగురువాపు మరియు పంటి నొప్పి చికిత్సలో సహాయపడుతుంది. అలాగే నిమ్మకాయ రసాన్ని అధిక మొత్తంలో తీసుకుంటే పంటి ఎనామిల్ కి హాని కలిగిస్తుంది.
ఉదయం త్రాగటానికి నిమ్మకాయ నీరు ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఒక గ్లాస్ చల్లని లేదా వేడి నీటిని తీసుకోవాలి. జీర్ణక్రియ సమస్యలతో బాధ పడుతున్నవారు వేడి నీటిని మాత్రమే తీసుకోవాలి.
2. ఇప్పుడు ఈ గ్లాస్ నీటిలో అర చెక్క నిమ్మరసం పిండాలి.
3. దీనిలో ఎటువంటి పంచదార కలపకుండా త్రాగాలి.