జయసుధ చెల్లెలు కూతురు హీరోయిన్ అని మీకు తెలుసా..?
Jayasudha Sister Daughter:సహజనటి జయసుధ చెల్లెలుగా తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన నటి సుభాషిణి దాదాపు 100కి పైగా సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అగ్రహీరోలు, అగ్ర దర్శకుల సినిమాల్లో నటించిన సుభాషిణి దక్షిణాది భాషల్లో చేసింది. తక్కువ సినిమాలే అయినా గుర్తు ఉండేలా ముద్రవేసింది. శివరంజని మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సుభాషిణి మద్రాస్ లో పుట్టి పెరిగింది.
తెలుగు,తమిళ,కన్నడ,మళయాళ భాషల్లో నటించింది. దాసరి నారాయణరావు, కె రాఘవేంద్రరావు లతో ఎక్కువ సినిమాల్లో చేసింది. సొంత మావయ్య కొడుకునే పెళ్లాడిన తర్వాత వెండితెరకు దూరమై మళ్ళీ అరుంధతి సినిమాలో పశుపతి తల్లిగా విలన్ గా మెప్పించింది.
అరుంధతి లో క్రూరత్వం గల పాత్ర పోషణలో అందరి మనసులు గెలుచుకున్న సుభాషిణి ఈమధ్య అలీ తో ఓ ప్రోగ్రాం లో పలు విషయాలను ప్రస్తావిస్తూ ఆడియన్స్ తో పంచుకుంది. ఒకసారి ఎయిర్ పోర్టులో సుభాషిణి తండ్రికి,హీరో రజనీకాంత్ కి వాగ్వివాదం జరగడంతో మధ్యలోనే సినిమా ఆపేసి వచ్చేశామని సుభాషిణి చెప్పింది. ఇక తూర్పు వెళ్లే రైలు సినిమాలో సుభాషిణికి ఛాన్స్ వచ్చింది.
అయితే తనతండ్రికి, డైరెక్టర్ భారతీరాజాకు గొడవ అవ్వడం వలన శ్రీలంక నుంచి వచ్చిన ఎం ఆర్ రాధా కూతురు అయిన రాధికకు ఛాన్స్ ఇచ్చేశారని దీంతో ఆమె స్టార్ హీరోయిన్ అయిందని సుభాషిణి వివరించింది. ఇక అరుంధతి తర్వాత అలాంటి పాత్రలే రావడంతో ఒప్పుకోలేదని సుభాషిణి చెప్పింది. చిన్నప్పుడు శ్రీదేవితో క్లోజ్ గా వుండే సుభాషిణి ఆమెతో బుర్కాలు వేసుకుని మరీ సినిమాలకు వెళ్ళేది.
ఇద్దరూ స్విమ్మింగ్ కూడా నేర్చుకున్నారట. అందుకే శ్రీదేవి మరణం గురించి టీవిలో చూసి సుభాషిణి డిప్రెషన్ లోకి వెళ్లిందట. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైనా కొన్నాళ్ల తర్వాత బుల్లితెరమీదికి వచ్చింది. జెమిని టివిలో నాగాస్త్రం,సుందరకాండ వంటి సీరియల్స్ లో నటించి సుభాషిణి మంచి పేరు తెచ్చుకుంది.
కాగా తాను హీరోయిన్ గా ఎక్కువ కాలం చేయకపోవడంతో కూతురిని హీరోయిన్ గా చేయాలని భావించింది. దీంతో పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో అతడి తమ్ముడు సాయి హీరోగా వచ్చిన 143లో సెకండ్ హీరోయిన్ గా సుభాషిణి కూతురు పూజ నటించింది. అయితే అది హిట్ కాకపోవడంతో మళ్ళీ ఆమె కనిపించలేదు. సుభాషిణి కూతురు పూజ పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యిపోయింది.