ఒక్క యాడ్ కోసం.. రాజమౌళి ఎంత పారితోషకం తీసుకున్నారో తెలుసా…?
Rajamouli Ad remuneration:దర్శక ధీరుడు రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్ళాడు. బాహుబలి సినిమాతో తెలుగు సినిమాల రేంజ్ గురించి బాలీవుడ్ కి తెలియజేశాడు.RRR సినిమా ద్వారా ఆస్కార్ అవార్డును కూడా తీసుకొచ్చాడు. రాజమౌళితో ఒక్క సినిమా అయినా చేయాలని ప్రతి హీరో, హీరోయిన్ అనుకుంటారు.
రాజమౌళి సినిమాలతో చాలా బిజీగా ఉంటారు. ప్రతి సినిమాని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు ప్రాణం పెట్టి చేస్తారు. అయితే ఈసారి రాజమౌళి ఒక Ad లో కనపడ్డారు. ఒక ప్రముఖ మొబైల్ కంపెనీ కోసం ఒక యాడ్ చేయడం జరిగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో రాజమౌళి యాడ్ కోసం ఎంత తీసుకున్నాడు అనే విషయం మీద చర్చ సాగుతుంది. సాధారణంగా ఒక్కో సినిమాకి రాజమౌళి 150 కోట్ల వరకు తీసుకుంటాడు. అయితే ఈ యాడ్ కోసం దాదాపుగా 3 కోట్ల రూపాయిలను తీసుకున్నాడని సమాచారం.