Healthhealth tips in telugu

మాంసాహారానికి బదులుగా ఒక కప్పు తింటే ఊహించని ప్రయోజనాలు ఎన్నో…అసలు నమ్మలేరు

Mushrooms Health benefits In Telugu : ఇతర కూరగాయలతో పోలిస్తే పుట్ట గొడుగులు కాస్త ఖరీదు ఎక్కువగా ఉంటాయి. అలాగని కొనటం మాని వేయకండి. ఎందుకంటే… వీటిలో పోషకాలు ఎక్కువ. నలబైకి పై బడిన మహిళలు మాంసాహారానికి బదులుగా ఒక కప్పు మష్రుమ్స్ తింటే చాలా మేలు జరుగుతుంది.

తరచూ మష్రుమ్స్ తినటం వలన శరీరానికి సరిపడా విటమిన్ డి అందుతుంది. రోగ నిరోధక శక్తి వృద్ది చెందుతుంది. వీటిల్లో విటమిన్ బి సమృద్దిగా ఉంటుంది. రిబోఫ్లేవిన్, నియాసిన్ వంటి పోషకాలు అందాలంటే వీటిని తప్పకుండా తినాలి. రిబోఫ్లేవిన్ ఎర్ర రక్త కణాలను పెరిగేలా చేస్తుంది. నియాసిన్ చర్మానికి మేలు చేస్తుంది. జీర్ణ వ్యవస్థ పని తీరును మెరుగు పరుస్తుంది.

పుట్ట గొడుగుల్లో ఉండే ఖనిజాలు నాడి వ్యవస్థను దృడంగా ఉంచటంలో కీలక పాత్ర పోషిస్తుంది. దాంతో పాటు హార్మోన్ ల అసమానతలను తగ్గిస్తుంది. వీటిలో లభించే సెలీనియం యాంటి ఆక్సిడెంట్లా పని చేస్తుంది. శరీరంలోని మృత కణాలను తొలగించి కొత్త కణాల వృద్దికి సహాయ పడుతుంది.

మష్రుమ్స్ లో ఉండే రాగి శరీరానికి అవసరమైన ప్రాణ వాయువును అందేలా చేస్తుంది. అలాగే ఎముకలు బలంగా ఉండేలా చేస్తుంది. మష్రుమ్స్ లో ఉండే పొటాషియం అధిక రక్తపోటును అదుపులో ఉంచటానికి సహాయ పడుతుంది. కండరాలను ఉత్తేజితం చేస్తుంది. బరువు తగ్గాలని అనుకునే వారు వీటికి ప్రాదాన్యత ఇవ్వాలి.

దీనిలో కేలరీలు, కొవ్వు తక్కువగా ఉంటాయి. వీటిని తింటే శరీరానికి శక్తి మాత్రమే వస్తుంది. వీటిని కూరల్లో తినటానికి ఇష్టపడకపోతే సూప్లో వేసుకొని తినవచ్చు. కాబట్టి వారంలో రెండు సార్లు అయినా మష్రూమ్ తినటానికి ప్రయత్నం చేయండి. వాటిలో ఉండే పోషకాలు మన ఆరోగ్యం బాగుండేలా చేస్తాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News