ఆనంద్ హీరోయిన్ గుర్తు ఉందా…ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?
Telugu actress Kamalinee Mukherjee : మంచి కాఫీ లాంటి సినిమా కాప్షన్ తో టాలీవుడ్ లో ఆ మధ్య వచ్చి అలరించిన ఆనంద్ సినిమాతో మనందరినీ ఆకట్టుకున్న కమిలిని ముఖర్జీ ఆతర్వాత కొన్ని సినిమాల్లో తన నటనతో ఆకట్టుకుంది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన ఆనంద్ సినిమా ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ కోల్ కత్తా బ్యూటీ అందం , అభినయంతో ఆకట్టుకున్న ఈ భామ తన సినిమాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో స్టార్ హీరోయిన్ గా రాణించలేకపోయింది.
ఆ తరువాత వచ్చిన “గోదావరి” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇక వరుస పెట్టి అవకాశాలు రావడంతో హ్యాపీడేస్, గోపి గోపిక గోదావరి, నాగవల్లి, జల్సా, గమ్యం సినిమాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఈ మధ్య సినిమాలు కూడా తగ్గిన ఈ భామ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.
గతంలో ఈమె నటించిన చిత్రంలోని టాలీవుడ్ నటుడి ప్రేమలోనే పడిందని , త్వరలోనే పెళ్ళికి సిద్ధమవుతోందని టాక్. సినిమాలు తగ్గడంతో పెళ్ళిచేసుకోవాలని సెటిల్ కావాలని భావిస్తోందట. అయితే ఎన్ని వార్తలు వస్తున్నా కూడా ఈమె నుంచి క్లారిటీ లేదు, ఖండన లేదు. తెలుగులో చివరిగా గోవిందుడు అందరివాడేలే సినిమాలో కనిపించిన కమలిని ఆ తరువాత సినిమాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం బిజినెస్ వైపు దృష్టి సారించి అమెరికాలో స్థిరపడ్డారు. ఇటీవల డల్లాస్ లోని ఓ ఈవెంట్ లో కమలిని సందడి చేసారు. ఈ ఈవెంట్ తాలూకు ఫోటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.
Click Here To Follow Chaipakodi On Google News