చిరంజీవి భార్యకు, హీరోయిన్ రాశికి మధ్య ఉన్న ఈ రిలేషన్ ఏంటో తెలుసా?
Heroine Raasi And Surekha:హీరోయిన్ రాశి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాశి చైల్డ్ ఆర్టిస్టుగా తన కెరీర్ ని ప్రారంభించి ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే రాశి గురించి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వాటి గురించి తెలుసుకుందాం.
హీరోయిన్ రాశి మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖకు మధ్య ఓ రిలేషన్ ఉంది. అది ఏమిటంటే రాశి హీరోయిన్ గా ఎదగటానికి సురేఖనే కారణం. చిరంజీవి తమ్ముడు సురేఖ మరిది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన గోకులంలో సీత సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు ముత్యాల సుబ్బయ్య దర్శకుడుగా పనిచేశారు.
ఈ సినిమాలో హీరోయిన్ కోసం వెతుకుతున్న సమయంలో సురేఖ రాశి అయితే బాగుంటుందని ముత్యాల సుబ్బయ్యకు సూచించారు. అప్పటికే రాశి చిరు గ్యాంగ్ లీడర్ హిందీ వర్షన్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. దాంతో చిరు ఫ్యామిలీతో రాశికి మంచి అటాచ్మెంట్ ఉంది. ఆ విధంగా గోకులంలో సీత సినిమా ద్వారా రాశి హీరోయిన్ గా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి చాలా తక్కువ సమయంలోనే మంచి స్థాయికి చేరింది.
Click Here To Follow Chaipakodi On Google News