నిహారిక కంటే ముందే విడాకులు తీసుకున్న సినీ సెలబ్రిటీలు వీరే..!
సినీ ఇండస్ట్రీలో ప్రేమించడం పెళ్లి చేసుకోవడమే కాదు,విడాకులు,బ్రేక్ అప్ లు సర్వ సాధారణం అయ్యాయి. అలాగే పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు కూడా విడాకులకు దారితీసాయి. శరత్ బాబు , రమాప్రభ 1981లో ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. అయితే మనస్పర్ధలతో 19988లోనే విడిపోయారు.
1984లో ప్రముఖ నిర్మాత డాక్టర్ డి రామానాయుడు కూతురు లక్ష్మితో నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు తనయుడు నాగార్జునతో వివాహం అయింది. వీరిద్దరికి మనస్పర్థలు రావడంతో 1990లో విడాకులు తీసుకున్నారు. అప్పటికే వీరికి నాగచైతన్య పుట్టాడు. విడాకులు ఇచ్చిన ఏడాది అంటి అమలను నాగ్ ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు.ఇక మోహన్ బాబు తనయుడు మనోజ్ 2015లో ప్రణతి రెడ్డి ని ప్రేమించి పెళ్లాడాడు.
అయితే 2019లో విడాకులు తీసుకున్నారు. 1997లో నందినిని పెళ్లాడిన పవన్ ఆతర్వాత విడాకులిచ్చి,రేణు దేశాయ్ తో సహజీవనం చేస్తూ 2009లో పెళ్లి చేసుకున్నాడు. 2012లో రేణు కి విడాకులిచ్చి రష్యాకు చెందిన అన్నా లెజెనవా ను పెళ్లిచేసుకున్నాడు. నటి కీర్తిరెడ్డిని 2004లో ప్రేమించి పెళ్లాడిన నాగ్ మేనల్లుడు సుమంత్ ఆతర్వాత అభిప్రాయ బేధాల కారణంగా 2006లో విడాకులు తీసుకున్నారు.
హీరో కమల్ హాసన్ 1978లో 24 ఏళ్ల వయస్సులో నర్తకి వాణి గణపతిని పెళ్లి చేసుకున్నాడు. పదేళ్ల తరువాత వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇక ఆ తరువాత నటి సారికను పెళ్లి చేసుకున్నాడు కమల్ హాసన్. 2002లో సారికకు కూడా విడాకులు ఇచ్చాడు. వీరికి శృతి హసన్,అక్షర హసన్ అనే ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వీరిద్దరూ కూడా సినీ పరిశ్రమలో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. ప్రస్తుతం కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమాలో నటిస్తున్నాడు.
నాగచైతన్య-సమంత గురించి దాదాపు అందరికీ తెలిసిందే. ఏమాయే సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. అప్పటినుంచి వీరు ప్రేమలో మునిగితేలారు. 2017లో వీరి పెళ్లి జరిగింది. నాలుగేళ్ల పాటు కలిసి జీవించిన వీరు 2021లో విడిపోయారు.
1985లో ప్రముఖ సినీ నటి రాధిక ప్రతాప్ పోతన్ ని పెళ్లి చేసుకుంది. ఇక ఆ తరువాత పోతనకు విడాకులు ఇచ్చింది రాధిక. రెండోసారి లండన్ కి చెందిన రిచర్డ్ హ్యార్లీని వివాహం చేసుకున్నారు. ఇక ఆ తరువాత 2001లో హీరో శరత్ కుమార్ ప్రేమలో పడి మరో వివాహం చేసుకున్నారు.
నిహారిక- చైతన్య ల వివాహం డిసెంబర్ 9, 2020న గ్రాండ్ గా జరిగింది. తాజాగా ఈ జంట కూడా విడాకులు తీసుకున్నట్టు ఇటీవలే వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.
Click Here To Follow Chaipakodi On Google News