MoviesTollywood news in telugu

యాంకర్ శివజ్యోతి నెలకు ఎంత సంపాదిస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు

Tinmar news anchor shivjyoti:యాంకర్ గా తన లైఫ్ ని స్టార్ట్ చేసిన శివ జ్యోతి ఎన్నో ఎత్తు పల్లాలను చూసి తన అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. ఒకపక్క యాంకర్ గా పనిచేస్తూనే మరోపక్క యూట్యూబ్ లో వీడియోస్ చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. బిగ్ బాస్ రియాల్టీ షోలో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసి అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గర అయింది. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక శివజ్యోతి జీవితమే మారిపోయింది.

తీన్మార్ వార్తలతో శివ జ్యోతి చాలా ఫేమస్ అయ్యింది. అప్పటివరకు శివ జ్యోతిగా ఉన్న ఆమె పేరు తీన్మార్ సావిత్రిగా మారిపోయింది. 2019లో బిగ్ బాస్ షో కి వెళ్లి 98 రోజుల పాటు ఉంది. ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి బాగా ఫేమస్ అయిపోయింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియా ప్రోగ్రామ్స్, సినిమా ప్రోగ్రామ్స్ చేస్తూ నెలకు దాదాపుగా ఎనిమిది నుంచి పది లక్షల వరకు సంపాదిస్తుందట.

ఒక బీఎండబ్ల్యూ కారు, కియా కారు హైదరాబాద్ లో సొంత ఇల్లు, ఊర్లో కూడా ఇల్లు కట్టుకొని వాటిని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ చూపించింది. చాలా కష్టపడి ఎదిగిన శివజ్యోతి కోట్ల ఆస్తులను సంపాదించుకుంది.