Guava And Kidney Stones:కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు జామకాయ తింటే ఏమి అవుతుంది…
Guava And Kidney Stones:కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు జామకాయ తింటే ఏమి అవుతుంది… కొన్ని సమస్యలు ఉన్నవారు జామకాయకు దూరంగా ఉండటమే మంచిది. కొంత మందికి తినే ఆహారం విషయంలో కొన్ని అపోహలు ఉంటాయి.
చాలా తక్కువ ఖర్చులో ఎక్కువ పోషకాలను మన శరీరానికి అందించే పండ్లలో జామకాయ ఒకటి. జామకాయలో విటమిన్ సి చాలా సమృద్దిగా ఉంటుంది. రోజు ఒక జామకాయ తింటే శరీరంలో రోగనిరోదక శక్తి పెరుగుతుంది. జామకాయ తినే విషయంలో చాలా సందేహాలు ఉంటాయి.
జామకాయ తింటే కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయని చాలా మంది తినరు. విత్తనాలు వున్న పండ్లను తింటే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడుతాయని చాలామంది అనుకుంటుంటారు. కానీ టొమాటో, జామ, బెండకాయ మొదలైన విత్తనాలను కలిగి ఉన్న ఆహారాన్ని మూత్రపిండాల్లో రాళ్లు ఉన్న రోగులు తినకుండా నోరు కట్టేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విత్తనాలు రాళ్లు ఏర్పడే సామర్థ్యాన్ని పెంచవు.
జామపండులో విటమిన్ ఎ మరియు లూటీన్ మరియు లైకోపీన్ వంటి ఇతర ఫైటోన్యూట్రియెంట్‌లు పుష్కలంగా ఉన్నాయి, ఇవి యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉన్న సమ్మేళనాలు, ఇవి ఆక్సీకరణ ఒత్తిడికి వ్యతిరేకంగా మూత్రపిండాల కణాలకు సహాయపడతాయి. పొటాషియం తక్కువ ఉన్న జామకాయను తినవచ్చు.
జామలో కరగని ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది జీర్ణవ్యవస్థలో ఆహారాన్ని బాగా జీర్ణం చేయటంలో సహాయపడటమే కాకుండా చిన్న ప్రేగులలోని మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. జీర్ణ వ్యవస్థలో సమస్యలు లేకుండా చేస్తుంది. అయితే మోతాదు మించకుండా తినాలి. ఒకసారి డాక్టర్ ని సంప్రదించి తినటం చాలా ఉత్తమం.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x
Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ