సొంత మరదళ్ళనే పెళ్లాడిన మనకు ఇష్టమైన హీరోలు ఎంత మంది ఉన్నారో …?
కొందరు స్టార్ హీరోలు,హీరోయిన్స్ ప్రేమించి పెళ్లిచేసుకుంటుంటే, కొందరి పెళ్లిళ్లు నిలబెడ్తున్నాయి. మరికొందరు విడాకులకు వెళ్తున్నారు. ఇక ఏ స్టార్ హీరో అయినా సరే,ఇంట్లో వాళ్ళు కుదిర్చిన సంబంధాలు చేసుకుంటున్నారు. పైగా సొంత మరదళ్ళనే పెళ్ళాడుతున్నారు. అలాంటి వాళ్లలో పాత తరంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు తన మామ కూతురైన బసవ తారకం ను పెళ్లిచేసుకున్నారు. నిజానికి ఎన్టీఆర్ ఆస్తులు కరిగిపోయినా సరే,ఆమె పెళ్లిచేసుకొవడం సంచలనం. వీరి జీవితం గురించి సినిమా కూడా వచ్చింది.
ఇక అప్పటి మరో స్టార్ హీరో అక్కినేని నాగేశ్వరరావు సైతం తమ మరదలైన అన్నపూర్ణను పెళ్లిచేసుకున్నాడు. అలాగే సూపర్ స్టార్ కృష్ణ కూడా తన మరదలు ఇందిరను వివాహం చేసుకున్నాడు. అయితే సినిమాల్లో నటించే సమయంలో విజయనిర్మలను ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. అయితే ఇందరతో ఎంతో సఖ్యతతో ఉంటున్నాడు.
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు భార్య విద్యాదేవి కి మంచు లక్ష్మి,విష్ణు పుట్టాక ఆమె చనిపోతే ఆమె చెల్లెల్లు, తన మరదలైన నిర్మలాదేవిని రెండోపెళ్లి చేసుకున్నాడు. వీరికి మంచు మనోజ్ పుట్టాడు. ఇప్పటి తరంలో టాలీవుడ్ కి సంబంధించి సాయికుమార్ కొడుకు ఆది తప్ప మరదళ్ళను పెళ్లిచేసుకున్నవాళ్ళు లేకుండా పోయారు. సాయికుమార్ భార్య తమ్ముడి కుమార్తెనే ఆది పెళ్లిచేసుకున్నాడు.చిన్ననాటి నుంచి ఇరు ఫ్యామిలీలు నిర్ణయించుకున్నాయి. ఇక అది,అరుణ లకు కూడా ఒకరంటే ఒకరికి ఇష్టం కావడంతో పెళ్లయింది. వీరికి ఒక కుమార్తె ఉంది.
కాగా హీరో సూర్య తమ్ముడు కార్తీ ఒకడు. ఖైదీ మూవీతో తెలుగులో ఇతడి తాజా సినిమా డబ్బింగ్ అయింది. సొంత మరదలు రజనీతో పెద్దలు సంబంధం కుదర్చగా పెళ్లిచేసుకున్నాడు. వీరికి ఒక కుమార్తె ఉంది. సౌత్ ఇండియన్ స్టార్ శివ కార్తికేయ తమ మామ కూతురైన ఆర్తిని పెళ్లిచేసుకున్నాడు. వీరికి ఓ కూతురు ఉంది.