Healthhealth tips in telugu

ఈ 5 తింటే చాలు 75 ఏళ్ళ వయస్సులో 25 ఏళ్ళ ఎనర్జీతో అలసట,రక్తహీనత లేకుండా హాయిగా..

Health Tips To Control Anemia In Telugu : ఈ మధ్య కాలంలో చిన్నా,పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిలోనూ రక్తహీనత సమస్య కనపడుతుంది. ఈ సమస్య ప్రారంభంలో ఉంటే మాత్రం ఆహారంలో మార్పులు ద్వారా ఈ సమస్య నుండి బయట పడవచ్చు. అదే సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే డాక్టర్ సూచనలను పాటిస్తూ ఇప్పుడు చెప్పే ఆహారాలను తీసుకుంటే సరిపోతుంది.
fenugreek seeds
మెంతులలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. రక్తహీనతను తగ్గించటానికి చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. మెంతులలో కొవ్వులొ కరిగే క్లోరోఫిల్ సమృద్ధిగా ఉండుట వలన రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది. జీర్ణ సంబంధ సమస్యలను కూడా మెంతులు తగ్గిస్తాయి. కాబట్టి ప్రతి రోజు అరస్పూన్ మెంతులను నానబెట్టి తీసుకోవాలి.
beetroot juice
బీట్ రూట్ లో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. బీట్ రూట్ జ్యూస్ ప్రతి రోజు తీసుకుంటే రక్తహీనత సమస్య నుండి చాలా త్వరగా బయటపడవచ్చు. బీట్‌రూట్ రక్తంలో ఉండే ఎర్రరక్త కణాల సంఖ్యను పెంచటమే గాకుండా… శరీరానికి కావలసిన తాజా ఆక్సిజన్‌ను కూడా అందిస్తుంది. బీట్ రూట్ లో ఉండే విటమిన్ సి శరీరం ఐరన్ ని శోషించుకోవటానికి సహాయపడుతుంది. అలాగే ఎర్ర రక్త కణాల పునరుత్పత్తికి సహాయపడుతుంది.
kismis Health benefits in telugu
కిస్ మిస్ లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. కిస్ మిస్ తీసుకోవటం వలన రక్తహీనతను తగ్గించుకోవచ్చు. ఇది హీమోగ్లోబిన్ లెవల్స్ ను పెంచడం మాత్రమే కాదు, రక్తహీనతను తగ్గిస్తుంది. ప్రతి రోజు 5 కిస్ మిస్ లను తినాలి. కిస్ మిస్ లను మామూలుగా తినవచ్చు…లేదంటే నానబెట్టి తినవచ్చు.
jaggery Health benefits in telugu
అలాగే బెల్లంలో కూడా ఐరన్ సమృద్దిగా ఉంటుంది. రక్త హీనత తో బాధపడుతున్న వారిలో ఐరన్ లేకపోవటం వలన అలసట, బలహీనత కలుగుతాయి. ప్రతి రోజు చిన్న బెల్లం ముక్క తింటే సరిపోతుంది. అయితే ఆర్గానిక్ బెల్లం తింటే మంచిది. ఆర్గానిక్ బెల్లం ముదురు రంగులో ఉంటుంది.
Health Benefits of Dates
ఖర్జూరంలో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది. ప్రతి రోజు రెండు ఖర్జూరాలను తినాలి. ఇప్పుడు చెప్పిన ఆహారాలను రెగ్యులర్ గా తీసుకుంటే రక్తహీనత సమస్య నుండి బయట పడవచ్చు. మన ఆహారంలో మార్పులు చేసుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి ఈ ఆహారాలను తినటానికి ప్రయత్నం చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/