Kitchen

బెండకాయలు ఏడాది పొడవునా తాజాగా నిల్వ ఉండాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి

Lady Finger Storage Tips: సాధారణంగా బెండకాయలను మనం కొన్న తర్వాత ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. రెండు రోజులకే వడలిపోతాయి. బెండకాయలు వారం కాదు నెల కాదు ఏకంగా సంవత్సరం పాటు నిల్వ ఉండాలంటే ఇప్పుడు చెప్పే చాలా బాగా సహాయపడుతుంది. అయితే బెండకాయలు సంవత్సరం పొడవునా నిల్వ ఉండాలంటే ఫ్రిజ్ అవసరం.

ఒక పెద్ద గిన్నెలో నీళ్లు పోసి వెనిగర్ వేసి బాగా కలిపి ఆ నీటిలో బెండకాయలను వేసి బాగా కడగాలి. ఆ తర్వాత పొడి బట్టతో శుభ్రంగా తుడిచి బెండకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి జిప్ లాక్ కవర్లో వేయాలి. ఇలా జిప్ లాక్ కవర్లో వేసిన తర్వాత జిప్ లాక్ కవర్లో గాలి మొత్తం బయటకు పోయేలా చేయాలి. అప్పుడు జిప్ లాక్ కవర్లో బెండకాయలు టైట్ గా బిగిసుకుంటాయి.

కావలసినప్పుడు బెండకాయ ముక్కలను తీసుకుని వాడుకోవాలి. మరలా తిరిగి ఫ్రిజ్లో పెట్టే సమయంలో జిప్ లాక్ కవర్లో గాలి పూర్తిగా బయటికి పోయేలా జాగ్రత్త తీసుకోవాలి. బెండకాయలను కడగటానికి వెనిగర్ ఉపయోగించడం వలన బెండకాయల మీద రసాయన అవశేషాలు తొలగిపోయి ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి సహాయపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.