MoviesTollywood news in telugu

మంచి ఆఫర్స్ వదిలేసుకున్న స్టార్స్ …ఎంత మంది ఉన్నారో…?

Stars Who Rejected Best Offers :ఏదైనా ఒక సినిమా కథ రాసేటప్పుడు అందుకు సంబందించిన జాగ్రత్తలు ఎన్నో తీసుకుంటారు. పైగా హీరో, హీరోయిన్స్ ని దృష్టిలో పెట్టుకుని కథ రెడీ చేస్తారు. తీరా అందుకు వాళ్ళు ఒప్పుకోకపోతే అది వేరే వాళ్ళ చేతికి వెళ్ళిపోతుంది. మార్పులు కూడా ఆటోమేటిక్ గా చోటుచేసుకుంటాయి. అయితే ముందుగా ఎవరిని అనుకుని, ఆతర్వాత మార్చుకోవలసి వచ్చిందో ఇటీవల కొన్ని సినిమాల విషయంలోకి వెళ్తే, ఆహా ఓటిటి లో రిలీజై , పెద్ద హిట్ కొట్టిన కలర్ ఫోటో సినిమాలో హీరో సుహాస్, హీరోయిన్ చాందిని బాగానే నటించారు. అయితే ముందుగా నిహారికను అనుకున్నారట. ఓ ఇంటర్యూలో డైరెక్టర్ సందీప్ చెప్పారు. ఒకవేళ ఆమె చేసి ఉంటె అందమైన మూవీగా గుర్తుండిపోయేది.

అలాగే ఇటీవల ఓటిటి లో రియీజైన 1992మూవీ మంచి హిట్ అయింది. హర్షద్ మెహతా నేపథ్యంలో సాగే ఈ కథలో ముందుగా వరుణ్ ధావన్ ని అనుకున్నారట. కానీ ఈ ఛాన్స్ ప్రతీక్ కి దక్కింది. హిందీలో అందాదున్ మూవీలో టబు పవర్ ఫుల్ పాత్ర వేసింది. ఈ మూవీ హిట్ అవ్వడంతో నితిన్ తెలుగులో రీమేక్ చేయాలని చూస్తున్నాడు. మరి తెలుగులో పవర్ ఫుల్ రోల్ ని ఎవరు వేస్తారని చర్చ నడుస్తోంది. టబు డేట్స్ లేకపోవడంతో నయనతారను అడిగారు. ఆమె డేట్స్ లేవు. అనసూయను అడిగితె నో చెప్పడంతో ఇప్పుడు తమన్నా నటిస్తోందట.

ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ సరసన ఇంగ్లీషు హీరోయిన్ డై సీ జోమ్స్ ని అనుకున్నారు. ఆమె తప్పుకోవడంతో మరొకరిని సెలెక్ట్ చేసినా అవ్వలేదు. దాంతో ఇంగ్లీషు పాప ఒలీవియా ను తీసుకున్నారు. సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప మూవీలో విలన్ గా విజయ్ సేతుపతి చేస్తున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. సినిమా ఆలస్యం కావడంతో ఆయన తప్పుకున్నట్లు తెలియడంతో ఇంతవరకూ విలన్ ఎవరనేది వెల్లడికాలేదు. ఇక తమిళంలో అసురన్ మూవీ సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో తెలుగులో వెంకటేష్ రీమేక్ చేస్తున్నాడు. అదే లుక్ తో వెంకీ అదరగొడుతున్నాడు. హీరోయిన్ గా అనుష్క, తర్వాత శ్రేయ అనుకున్నారట. చివరకు ప్రియమణికి ఛాన్స్ దక్కింది.