వర్షాకాలంలో బట్టల నుండి దుర్వాసన రాకుండా ఉండాలంటే…సింపుల్ చిట్కాలు
Clothes Smell Bad In Rainy Season:వర్షాకాలంలో వానలు ఎక్కువగా కురుస్తూ ఉంటాయి. రోడ్ల మీద కూడా నీరు ఎక్కువగా ఉండటం వలన బయటికి రావటం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అలాగే ఆరబెట్టిన బట్టలు కూడా తొందరగా ఆరవు. వారం రోజులు గడిచిన తడి తడిగానే ఉంటాయి. ఒక్కొక్కసారి ఆరిన బట్టలు దుర్వాసన కూడా వస్తాయి. ఇలా దుర్వాసన రాకుండా ఉండాలంటే ఇప్పుడు చెప్పే చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి.
బట్టలు ఉతికినప్పుడు డిటర్జెంట్ పౌడర్ లో బేకింగ్ సోడా, వెనిగర్ కలిపితే దుర్వాసన తొలగిపోతుంది. దుర్వాసన లేకుండా బట్టలు శుభ్రంగా ఉంటాయి.అలాగే డిటర్జెంట్ పౌడర్ లో నిమ్మరసం కలిపి బట్టలు ఉతికితే …నిమ్మరసంలో ఉండే గుణాలు దుర్వాసన కలిగించే బ్యాక్టీరియాను చంపుతాయి. వర్షాకాలంలో కబోర్డ్స్ లో బట్టల మధ్య కర్పూరం బిళ్ళలను ఉంచితే బట్టల దుర్వాసన తొలగిపోతుంది.
అలాగే బట్టలు ఆరబెట్టిన చోట సాంబ్రాణి పొగ వేస్తే బట్టల నుంచి దుర్వాసన తొలగిపోతుంది. ఈ చిట్కాలను పాటిస్తే వర్షాకాలంలో కూడా బట్టలు దుర్వాసన లేకుండా మంచి వాసన తో శుభ్రంగా ఉంటాయి.
https://www.chaipakodi.com/