ఈ రస్నా గర్ల్ ఒకప్పుడు తెలుగులో హీరోయిన్ అని మీకు తెలుసా…?
Tollywood heroine Ankitha: తెలుగులో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన టువంటి సింహాద్రి చిత్రంలో తన మరదలి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ముద్దుగుమ్మ అంకిత గురించి చిత్రపరిశ్రమలో తెలియనివారుండరు.అయితే ఈ అమ్మడు ఒకప్పుడు రస్నా కూల్ సాఫ్ట్ డ్రింక్ యాడ్ లో కూడా నటించింది.ఈ యాడ్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుని వెండి తెర వైపు నటనలో అడుగులేసింది.అయితే ఒకప్పుడు తెలుగులో జూనియర్ ఎన్టీఆర్, రవితేజ, నవదీప్, నందమూరి బాలకృష్ణ, స్వర్గీయ నందమూరి హరికృష్ణ, సుమన్, శివాజీ, అల్లరి నరేష్ తదితర హీరోలతో కలిసి పనిచేసింది.
అయితే ఇందులో కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి.కాగా ఏమైందో ఏమో గాని ఉన్నట్లుండి ఈ మధ్యకాలంలో అంకిత తెలుగు వెండితెర పై అస్సలు కనిపించడం లేదు. అయితే తెలుగులో ఈ అమ్మడు నటించినటువంటి చిత్రాల్లో సింహాద్రి, లాహిరి లాహిరి లాహిరిలో, ధనలక్ష్మి ఐ లవ్ యు తదితర చిత్రాలు అంకితకి మంచి గుర్తింపు తెచ్చాయి.కాగా అంకిత ఒక్క తెలుగులోనే కాక తమిళ భాషలో కూడా చిత్రాల్లో నటించింది.
అయితే అక్కడ కూడా చెప్పుకోవడానికి సరైన హిట్ లేక పోవడంతో సినీ కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంది.ప్రస్తుతం అంకిత పూర్తిగా సినిమాలు మానేసి తన కుటుంబ బాధ్యతలను చక్కబెట్టుకునే పనిలో పడినట్లు సమాచారం. పెళ్లి తరువాత సినిమాలకుగుడ్ బై చెప్పిన అంకిత ప్రస్తుతం అమెరికాలో న్యూ జెర్సీలో స్థిరపడింది. దాదాపు అర ఎకరం స్థలంలో నిర్మించుకున్న అందమైన ఇంట్లో నివసిస్తోంది. ఆమెకు ఇద్దరు కుమారులు సంతానం కాగా.. అంకిత భర్త విశాల్ అమెరికాలోని సిటీ బ్యాంకు లో పని చేస్తున్నారు.