స్టార్ హీరో తండ్రిని గుర్తు పట్టారా..ఎన్ని సినిమాల్లో నటించారో తెలుసా?
chiranjeevi Father movies: ఇప్పుడంటే మెగాస్టార్ కానీ ఒకప్పుడు చిన్న స్టార్. క్యారెక్టర్ పాత్రలు,విలన్ పాత్రలతో నెట్టుకొస్తూ,తనలోని నటనకు మెరుగులు దిద్దుకుంటూ సుప్రీం హీరోగా, ఆతర్వాత మెగాస్టార్ గా ఎదిగాడు. అయితే ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుకునని చిరంజీవి,పవన్ కళ్యాణ్,నాగబాబు సగర్వంగా చెప్పుకుంటారు. అయితే తండ్రి కానిస్టేబుల్ మాత్రమే కాదు. ఒక నటుడు కూడా.
నటనపై ఆసక్తి గల చిరు తండ్రి వెంకట్రావు ఎక్సయిజ్ ఇన్స్పెక్టర్ గా చేసి రిటైరయ్యారు. 1969లో వచ్చిన జగత్ కిలాడీలు మూవీలో ఓ చిన్నపాత్రలో వెంకట్రావు మెరిశారు. ఆవిధంగా నటనపై గల ఆసక్తిని,ముచ్చటను తీర్చుకున్నారు. ఎస్వీ రంగారావు నటించిన జగత్ కిలాడీలు మంచి హిట్ అయింది. తర్వాత కొన్ని సినిమాల్లో కనిపించినప్పటికీ కుటుంబ బాధ్యతలు,ఉద్యోగం కారణంగా సినిమాలవైపు కన్నెత్తి చూడలేదు.
అందుకే కొడుకు చిరంజీవిని నటనావైపు ప్రోత్సహించారు. కొడుకు టాప్ పొజిషన్ లోకి వెళ్లడంతో తండ్రి మురిసిపోయారు. అయితే చిరంజీవి నటించిన ఓ సినిమాలో వెంకట్రావు కూడా అనుకోకుండా నటించారు. ఇది చాలామందికి తెలియని విషయం. బాపు తీసిన సూపర్ హిట్ మూవీ లో మంత్రి పాత్ర కోసం బాపు ఆలోచిస్తుంటే, మంత్రిగారి వియ్యకుండు అవ్వడం కోసం అల్లు రామలింగయ్య ఓ ఇంటికి వెళ్లడం,అక్కడ కె వెంకటరావు మంత్రి అని రాసి ఉండడం జరుగుతాయి. అలా చిరంజీవి సినిమాలో తండ్రి నటించాడు.