టీతో పాటు బిస్కెట్లు తింటున్నారా…అయితే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే…?
Health Care: మనలో చాలా మంది ఉదయం సమయంలో టీ తాగుతూ ఉంటారు. ఉదయం లేవగానే టీ తాగితే అలసట, బద్ధకం అన్ని మాయం అయి చురుకుగా ఉంటారు. కొంతమంది సాయంత్రం టీ తాగుతూ ఉంటారు. అలా టీ తాగినప్పుడు టీతో పాటు బిస్కెట్ కూడా తింటూ ఉంటారు. ఈ కాంబినేషన్ చాలా మంది ఇష్టపడతారు. అయితే ఈ విధంగా టీతో పాటు బిస్కెట్ తింటే ఆరోగ్యానికి హాని చేస్తుందని నిపుణులు అంటున్నారు.
టీతోపాటు బిస్కెట్ తింటే బీపీ పెరుగుతుందని బిస్కెట్లలో సోడియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటు సమస్యను పెంచి గుండెపోటు రావడానికి కారణం అవుతుంది.
బిస్కెట్ తయారీలో చక్కెర ఎక్కువ వాడుతూ ఉంటారు. అలాగే టీలో కూడా చక్కెర ఉంటుంది. ఇన్సులిన్ శోషనకు ఆటంకం కలిగి ఇన్సులిన్ హార్మోన్ల అసమతుల్యతకు దారి తీసి డయాబెటిస్ తీవ్రతను పెంచుతుంది. అలాగే జీర్ణక్రియను పాడుచేసి మలబద్ధకం సమస్యకు దారితీస్తుంది.
టీ తాగేటప్పుడు బిస్కెట్ కి బదులుగా వేగించిన శనగలు తింటే మంచిది. ఇవి ఇన్సులిన్ ని నియంత్రించి రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి. అలాగే జీర్ణశక్తిని మెరుగుపరిచే పైపర్ కూడా సమృద్ధిగా ఉంటుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/