ఎన్టీఆర్ సినిమాలో అర్హ నిమిషానికి ఎంత తీసుకుంటుందో తెలుసా…?
Allu Arha in Devara:టాలీవుడ్ లో హీరో అయినా హీరోయిన్ అయినా వారి వారసులు రావడం సహజమే. ఇప్పుడు అలా వారసత్వాన్ని ముందుకు తీసుకు వెళ్ళటానికి అల్లు అర్జున్ కూతురు అర్హ వచ్చింది. అల్లు అర్జున్ కూతురు అర్హ శాకుంతలం సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో భరతుడిగా నటించి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.
ప్రస్తుతం అల్లు అర్హ ఎన్టీఆర్ హీరోగా వస్తున్న దేవర సినిమాలో నటిస్తుంది. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో జాన్వి చిన్ననాటి పాత్రలో అర్హ నటిస్తుందట. ఈ సినిమాలో అర్హ పది నిమిషాల పాటు కనిపిస్తుందట. పది నిమిషాల సమయానికి దాదాపుగా 20 లక్షల రూపాయల పారితోషికం తీసుకుంటుంది. అంటే నిమిషానికి రెండు లక్షల పారితోషికం అర్హ తీసుకుంటుంది.