తెల్ల మిరియాలు Vs నల్ల మిరియాలు…ఏది తింటే ఆరోగ్యానికి మంచిది…నమ్మలేని నిజాలు
white Pepper And Black Pepper Benefits : మనం ప్రతి రోజు మిరియాలను వంటలలో వాడుతూ ఉంటాం. మిరియాలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మిరియాలలో నల్ల మిరియాలు, తెల్ల మిరియాలు అనే రెండు రకాలు ఉన్నాయి. మనలో చాలా మందికి తెల్ల మిరియాలు,నల్ల మిరియాలు…ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిదో అనే సందేహం ఉంటుంది.
నల్ల మిరియాలు కాస్త ఘాటుగా బలమైన రుచిని,వాసనను కలిగి ఉంటాయి. అలాగే వేడి చేసే గుణం కూడా ఉంటుంది. అదే తెల్ల మిరియాలు అయితే తేలికైన రుచి కలిగి ఉంటుంది. అలాగే వేడి చేసే గుణం కూడా తక్కువగానే ఉంటుంది. నల్ల మిరియాలు సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. తెల్ల మిరియాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు.
తెల్ల మిరియాల ప్రయోజనాల విషయానికి వస్తే…ఆకలి లేని వారిలో ఆకలిని పుట్టించి జీర్ణప్రక్రియ బాగా సాగేలా చేస్తుంది. జీవక్రియను వేగవంతం చేసి మలబద్దకం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. శోథ నిరోధక ప్రభావాన్ని కలిగి ఉండుట వలన శ్వాసనాళాలకు ఎటువంటి అడ్డంకులు లేకుండా చేసి శ్వాస సమస్యలు లేకుండా చేస్తుంది.
శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అలాగే శరీరంలో విషాలను బయటకు పంపటమే కాకుండా శరీరాన్ని శుభ్రపరుస్తుంది మరియు ప్రసరణను ప్రోత్సహిస్తుంది. గుండెకు సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. శరీరంలోని కొవ్వును కరిగించే క్యాప్సైసిన్ ఉండటం వల్ల బరువు తగ్గడంలో కూడా ఇది సహాయపడుతుంది.
నల్ల మిరియాల విషయానికి వస్తే…king of spices గా పేరుగాంచింది. వంట యొక్క రుచిని పెంచుతుంది. మిరియాలను రెగ్యులర్ గా తీసుకుంటే జీవక్రియను మెరుగుపరచి అధిక బరువును తగ్గిస్తుంది. నల్ల మిరియాలు ఎంజైమ్లు మరియు రసాలను ప్రేరేపించడం ద్వారా జీర్ణక్రియకు సహాయపడతాయి.
చర్మ సమస్యలు, ఉబ్బసం, సైనస్ మరియు నాసికా రద్దీకి చికిత్సలో సహాయపడుతుంది. .దగ్గు,జలుబు,గొంతు నొప్పి వంటి సమస్యలను తగ్గిస్తుంది. గొంతులో శ్లేష్మ ప్రవాహాన్ని తగ్గిస్తుంది. అలాగే క్యాన్సర్, మరియు గుండె మరియు కాలేయ వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. నల్ల మిరియాలు, తెల్ల మిరియాలు రెండూ కూడా మంచివే.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/