Healthhealth tips in telugu

షుగర్ నియంత్రణకు మెంతులు వాడుతున్నారా…ఈ నిజం తెలుసుకోండి

Fenugreek and diabetes :ఈ రోజుల్లో వయస్సుతో సంబందం లేకుండా చాలా చిన్న వయస్సులోనే డయబెటిస్ బారిన పడుతున్నారు. డయబెటిస్ వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాలి. అలాగే తీసుకొనే ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మధ్య కాలంలో మధుమేహం వ్యాధి నివారణకు మెంతులు మంచివని ఎక్కువగా వాడుతున్నారు.

మెంతులను ప్రతి రోజు ఆహారంలో ఎదో ఒక రూపంలో ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు. మెంతుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని మన అందరికి తెలిసిన విషయమే. అలాగే ఇటీవల జరిగిన పరిశోధనల్లో కూడా మధుమేహం నియంత్రణకు మెంతులు బాగా సహాయపడతాయని తెలిసింది. అంతేకాక జీర్ణ సంబంధ సమస్యలను సమర్ధవంతంగా తగ్గిస్తుంది. అలాగే బరువును తగ్గించటంలో కూడా సహాయపడుతుంది.
Joint Pains Home Remedies in telugu
అయితే చాలా మందికి ఒక సందేహం ఉంటుంది. మధుమేహం ఉన్నవారు మెంతులను తీసుకుంటే మందులు వాడవలసిన అవసరం లేదా? ఈ సందేహాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మధుమేహం ఉన్న ప్రతి ఒక్కరు మెంతులను వాడకూడదు. అసలు మెంతులను ఎవరు వాడవచ్చు…ఎవరు వాడకూడదు… అనే విషయాల గురించి తెలుసుకుందాం.

యువతి,యువకులు,నడి వయస్సు వారు, మధుమేహాన్ని అప్పుడే గుర్తించిన వారు, మధుమేహం కారణంగా ఎటువంటి అనారోగ్య సమస్యలు లేనివారు, బరువు ఎక్కువగా ఉన్నవారు మాత్రమే మెంతులను వాడటం మంచిది. అలాగే 15 సంవత్సరాల లోపు పిల్లలు,70 సంవత్సరాలు దాటినా వృద్దులు మెంతులను వాడకుండా ఉంటేనే మంచిది.

మధుమేహం వచ్చిన ఐదు లేదా ఆరు సంవత్సరాల వరకు మాత్రమే మెంతుల ప్రభావం ఉంటుంది. ఆ తర్వాత మధుమేహం వచ్చిన వారిలో మెంతుల ప్రభావం ఏ మాత్రం ఉండదు. మధుమేహం ఉన్నవారు మెంతులను వాడుతున్నాం కదా అని మందుల మోతాదును తగ్గించకూడదు.
డాక్టర్ చెప్పిన మోతాదులోనే మందులను తప్పనిసరిగా వాడాలి. అలాగే కిడ్నీ వ్యాధులు,గుండె వ్యాధులు ఉన్నవారు కూడా మెంతులను వాడటం అంత మంచిది కాదు.

అల్సర్ సమస్యలు ఉన్నవారు అసలు మెంతులను వాడకూడదు. బరువు తక్కువగా ఉన్నవారు,సన్నగా ఉన్నవారు,థైరాయిడ్ ఉన్నవారు,గర్భిణీ స్త్రీలు మెంతులను అసలు వాడకూడదు. మధుమేహం ఉన్నవారు మెంతులను వాడకుండా మందులను వాడుతూ రెగ్యులర్ గా రక్త పరీక్షలు చేయించుకోవాలి. దాని ప్రకారం డాక్టర్ ఇచ్చిన మందులను క్రమం తప్పకుండా వాడాలి.
https://www.chaipakodi.com/