MoviesTollywood news in telugu

సూపర్ స్టార్ ఇష్టంగా తినే ఫుడ్ ఏమిటో తెలుసా ?

Tollywood Super Star Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికీ కూడా టీనేజ్ కుర్రాడిలా ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు అతికొద్ది కాలంలోనే తన టాలెంట్ తో సూపర్ స్టార్ అయ్యాడు. ఇక పర్సనాలిటీ, బాడీ మెయింటెనెన్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

సినిమాల్లో చేస్తూనే పలు యాడ్స్ లో చేస్తూ బ్రాండ్ అంబాసిడర్ గా రాణిస్తున్న మహేష్ బాబు వ్యాపార రంగంలో కూడా అడుగుపెట్టి మల్టీఫ్లేక్స్ థియేటర్ నిర్మాణం చేసాడు. ఇక అందం ఏమాత్రం తరిగిపోకుండా ఉంటున్న మహేష్ తినే ఆహరం ఏమిటా అనుకుంటే అమ్మమ్మ చేతివంట అని తెల్సింది. అవును ఈ విషయం కూడా మహేష్ స్వయంగా చెప్పాడు.

ఒక interview లో ఇష్టమైన ఆహరం ఏమిటి అని అడిగితె అమ్మమ్మ చేతి వంట అని, ఆమె మరణంతో ఆ వంట మిస్ అయ్యానని చెప్పాడు. ఇక హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టమని చెప్పాడు. ఇక తన కూతురు సితార అంటే చాలా ఇష్టమని మహేష్ చెప్పాడు.