‘బేబి’ మూవీ వచ్చేది ఆ ఓటీటీలోనే …అప్పుడే వచ్చేది…!
Baby Movie OTT : ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయ్యి సంచలన విజయాలను సొంతం చేసుకుంటున్నాయి. అలాంటి సినిమాలలో బేబి సినిమా ఒకటి. ఆనంద్ దేవరకొండ,వైష్ణవి,విరాజ్ అశ్విన్ నటించిన ఈ సినిమా ముఖ్యంగా యూత్ ని ఎక్కువగా ఆకట్టుకుంది.
సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్కేఎన్ దర్శకుడు మారుతీ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ధియేటర్స్ లో సక్సెస్ గా రన్ అవుతుంది. ఈ సినిమా ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందనే వార్తలు సోషల్ మీడియాలో హాల్ చల్ సెహ్స్తున్నాయి. ఈ సినిమాను ఆహా ఓటిటీ ఫ్లాట్ ఫామ్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా నెల రోజుల తర్వాత అంటే ఆగస్టు 15వ తేదీన స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుంది.