బాదం పప్పు Vs జీడిపప్పు… ఏది తింటే ఆరోగ్యానికి మంచిది…నమ్మలేని నిజాలు
Almonds and cashews Benefits In Telugu : డ్రై ఫ్రూట్స్ లో అనేక పోషకాలు ఉన్నాయి. ఆ పోషకాలు అన్ని మన శరీరానికి బాగా హెల్ప్ చేస్తాయి. డ్రై ఫ్రూట్స్ తింటే కడుపు నిండిన భావన ఎక్కువ సేపు ఉండి ఆకలి తొందరగా వేయదు. డ్రై ఫ్రూట్స్ తినటానికి రుచిగా అవసరమైన పోషకాలతో నిండి ఉంటాయి. బాదం,జీడిపప్పు రెండింటిలోనూ గ్లూటెన్ లేకుండా విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి.
ఇప్పుడు మనం బాదాం పప్పు,జీడి పప్పు రెండింటిలో ఏది తింటే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే వాటిలో ఉన్న పోషక విలువల గురించి వివరంగా తెలుసుకుందాం. కేలరీల విషయానికి వస్తే..బాదం పప్పులో మోనో సంతృప్త కొవ్వు ఆమ్లం సమృద్ధిగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడుతుంది.
జీడిపప్పులో కూడా ఆరోగ్యకరమైన అసంతృప్త కొవ్వుతో నిండి ఉంటుంది.కొలెస్ట్రాల్ అసలు ఉండదు. రోజూ జీడిపప్పు తినటం వలన రక్తప్రవాహంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ప్రోటీన్ విషయానికి వస్తే… ఒక ఔన్స్ బాదం పప్పులో 6 గ్రాముల కంటే తక్కువ ప్రోటీన్ ఉంటుంది. అమైనో ఆమ్లాలు ఉండవు.
అదే జీడిపప్పులో అయితే ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది. శరీరానికి అవసరమైన ప్రోటీన్ అందుతుంది. జీడిపప్పులో ఉండే ప్రోటీన్,ఫైబర్ కడుపు నిండిన భావన కలిగించి జంక్ ఫుడ్స్ వైపు వెళ్లకుండా చేస్తుంది. ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే… బాదం పప్పులో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. బాదం పప్పులో విటమిన్ సి ఉండుట వలన ధమని ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది.
బాదం పప్పును రెగ్యులర్ గా తినటం వలన గుండె ఆరోగ్యంగా ఉండి గుండెకు సంబందించిన సమస్యలు రాకుండా ఉంటాయి. అంతేకాక మెదడు ఆరోగ్యానికి,మధుమేహ లక్షణాలు తగ్గించటానికి,మంట తగ్గించటానికి,ఆక్సీకరణ ఒత్తిడి తగ్గించటానికి,అధిక బరువు తగ్గించటానికి సహాయపడుతుంది. జీడిపప్పు తినటం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడటమే కాకూండా గుండె వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఎముకలకు బలాన్ని ఇస్తుంది. అంతేకాక క్యాన్సర్ నివారించటానికి మరియు కంటి చూపు మెరుగుదలకు సహాయపడుతుంది. బాదం మరియు జీడిపప్పు రెండింటిలో ఏది తింటే బెటర్ ఇప్పుడు చూద్దాం. బాదం పప్పు శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగిస్తుంది. బాదం పప్పులో అమైనో ఆమ్లాలు ఉండుట వలన వ్యాయమ సమయంలో కొవ్వులు మరియు పిండి పదార్థాలను బర్న్ చేయటానికి సహాయపడుతుంది.
జీడిపప్పులో విటమిన్ కె మరియు జింక్ సమృద్ధిగా ఉంటుంది. జీడిపప్పులో తక్కువ కొవ్వు ఉంటుంది. జీడిపప్పు తినటం వలన బరువు తగ్గటం అనేది జరగదు.బాదంలో ఫైబర్, విటమిన్ ఇ మరియు కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. బాదం పప్పు తింటే బరువు తగ్గుతారు. ఈ విషయాలు కొన్నిఅధ్యయనాల్లో తెలిసాయి.
కాబట్టి జీడిపప్పులో ఎన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ బరువు తగ్గాలని అనుకొనే వారు మాత్రం బాదాం పప్పు తినటమే మంచిది. చూసారుగా ఫ్రెండ్స్ జీడిపప్పు,బాదం పప్పు ఏది తింటే బెటర్ అన్న విషయం మీకు తెలిసిందిగా… మీరు కూడా వీటిని తిని వాటిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలను పొందండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/