బ్రో మూవీ ట్రైలర్ వచ్చేసింది…ట్రైలర్ లో హైలైట్ ఇదే…!
BRO Trailer: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,సాయి ధరంతేజ్ మొదటి సారిగా కలిసి నటిస్తున్న బ్రో మూవీ ట్రైలర్ వచ్చేసింది. తమిళ మూవీ రీమేక్ అయిన బ్రో చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. దాంతో ఈ సినిమా మీద అంచనాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి.
ఈ ట్రైలర్ సినిమాకి అవసరమైన హైప్ ని తీసుకువచ్చింది. పవన్ కళ్యాణ్ స్టైలిష్ మేక్ ఓవర్,డైలాగ్స్,కామెడీ,విజువల్స్ ట్రైలర్ లో హైలైట్ అయ్యాయి.మొత్తంగా 2 నిమిషాల 15 సెకన్ల పాటు ట్రైలర్ ఉంది. ఈ ట్రైలర్ చూస్తుంటే బ్రో సినిమా ఇంట్రెస్టింగ్‍గా, ఎంటర్‌టైనింగ్ ఉంటుందనే అంచనాలు పెరిగిపోయాయి.
ఈ సినిమాను జూలై 28న విడుదల చేయటానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. సాయి ధరమ్ తేజ్ తీరిక లేకుండా కాలానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా శ్రమించే బిజినెస్ మాన్ గా కనిపించారు. గాడ్ గా పవన్ కళ్యాణ్ ని పరిచయం చేశారు. సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురయ్యాక జరిగిన పరిస్థితులను కామెడీగా తెరకెక్కించారని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్స్ సీన్స్ సినిమాకు హైలెట్ కానున్నాయి. అయితే ఇక ఆలస్యం చేయకుండా మీరు కూడా బ్రో ట్రైలర్ ని చూసేయండి.