పెరుగుతో ఇలా చేస్తే చాలు ఒక్క రోజులో చుండ్రు,జుట్టు రాలే సమస్య తగ్గి జీవితంలో ఉండవు
Hair Care Tips:ఈ మధ్య కాలంలో చుండ్రు సమస్య,జుట్టు రాలే సమస్య చాలా ఎక్కువ అయింది. చుండ్రు సమస్యను ప్రారంభంలోనే తగ్గించుకోవాలి. చుండ్రును తగ్గించుకోకపోతే జుట్టుకి సంబందించిన అనేక రకాల సమస్యలు వస్తాయి. మన వంటింటిలో ఉండే రెండు వస్తువులతో సులభంగా తగ్గించుకోవచ్చు.
ఈ రెమిడీ కోసం మెంతి పొడిని ఉపయోగిస్తున్నాం. మెంతులను పొడిగా చేసుకొని నిల్వ చేసుకోవచ్చు. రాత్రి సమయంలో ఒక కప్పు పెరుగులో ఒక స్పూన్ మెంతి పొడి వేసి బాగా కలిపి అలా ఉంచాలి. మరుసటి రోజు ఉదయం ఈ పెరుగు,మెంతి మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించి అలా గంట వదిలేయాలి.
మెంతి పొడి లేకపోతే రాత్రి సమయంలో ఒక కప్పు పెరుగులో ఒక స్పూన్ మెంతులను వేసి మరుసటి రోజు ఉదయం మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ గా చేసి కూడా వాడవచ్చు. ఈ పేస్ట్ రాసిన గంట తర్వాత కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి.వారంలో రెండు సార్లు చేస్తే చుండ్రు,జుట్టు రాలే సమస్య తొలగిపోయి జుట్టు ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది.
తలలో ఇన్ఫెక్షన్ ల కారణంగా ఏర్పడిన చుండ్రు (dandruff), అలర్జీ వంటి సమస్యలను తగ్గించడానికి ఈ హెయిర్ ప్యాక్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. పెరుగులో ఉండే యాంటీ ఫంగల్ గుణాలు చుండ్రుని తగ్గిస్తాయి. పురాతన కాలం నుండి జుట్టు సంరక్షణలో పెరుగు,మెంతులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/