ప్రేమ కథా చిత్రం హీరోయిన్ ఇప్పుడు ఏమి చేస్తోందో తెలుసా?
Telugu heroine nandita raj :సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు, మహేష్ బాబు బావ సుధీర్ బాబు హీరోగా నటించిన ప్రేమ కథా చిత్రం లో నందితా రాజ్ హీరోయిన్ గా నటించి తన కళ్ళతో అందరినీ భయపెట్టడంతో పాటు ముగ్దుల్ని కూడా చేసింది. ఆ సినిమాతో బాగా గుర్తింపు పొందింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ ఈమధ్య సోషల్ మీడియాలో కనిపించడం లేదు.
దీంతో నందితా రాజ్ గురించి పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆమె ఎక్కడ ఉంది, ఏమి చేస్తోందని పలువురు సెర్చ్ చేస్తున్నారు. మోడలింగ్ రంగం నుంచి వచ్చిన ఈ భామ సరైన ఛాన్స్ లు రాక సినిమా రంగంలో నిలదొక్కుకోలేదు. నిజానికి డేరింగ్ డైరెక్టర్ తేజ డైరెక్ట్ చేసిన నీకు నాకు డాష్ డాష్ మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన నందితాకు ఆ మూవీ ప్లాప్ అయినా మంచి మార్కులే కొట్టేసింది.
ఇక ప్రేమ కథా చిత్రంతోనే అందరి దృష్టిలో పడింది. తర్వాత పలు సినిమాలు చేసినా సక్సెస్ రాలేదు. ఆమధ్య కొత్త దర్శకుడు రాజాకిరణ్, నటుడు సత్యం రాజేష్ కాంబినేషన్ లో వచ్చిన విశ్వామిత్ర మూవీలో చేసినా అది హిట్ కాలేదు. సినిమాల సెలక్షన్ లో చేసిన పొరపాట్ల వలన సినిమాలు హిట్ అవ్వకపోవడంతో కెరీర్ ఇబ్బందుల్లో పడింది. దాంతో సినిమాలో ఛాన్స్ లు తగ్గిపోవడంతో మళ్ళీ మోడలింగ్ వైపు అడుగులు వేసింది.