స్నేహ సినిమాల్లోకి రాక ముందు ఏమి చేసేదో తెలుసా?నమ్మలేని నిజాలు
Tollywood Heroine sneha: టాలీవుడ్ లో కొందరు హీరోయిన్స్ ఏ పాత్రకైనా రెడీ, దేనికైనా రెడీ అన్నట్లు ఉంటారు. కానీ అసభ్యతకు తావులేకుండా తమ హద్దులో తామంటూ రాణించేవారు కూడా ఉన్నారు. గతంలో సౌందర్య ఈవిధంగా మంచి పేరు తెచ్చుకుంది. ఆతరవాత హీరోయిన్ స్నేహ అదే బాణీలో వెళ్ళింది. ఈమె అసలు పేరు సుహాసిని. ఈమె తండ్రి రాజారామ్ నాయుడు,తల్లి పద్మావతి. స్నేహ తాతముత్తాతలు రాజమండ్రిలో నివసించారు. అయితే కొన్ని దశాబ్దాల క్రితం వాళ్లంతా వివిధ ప్రాంతాలకు వెళ్లి స్థిరపడ్డంతో స్నేహ ఫామిలీ ముంబై చేరింది. అక్కడ నుంచి దుబాయి వెళ్లిన ఈమె కుటుంబం ఆతర్వాత తమిళనాడు చేరుకొని పన్ రొట్టి ప్రాంతంలో సెటిల్ అయింది.
స్నేహ కాలేజీ స్టడీస్ తమిళనాట సాగింది. అప్పట్లో స్నేహ వాళ్లకి మ్యారేజ్ హాలు కూడా ఉండేది. కుంభకోణం దారిలో గల స్నేహ మహల్ కల్యాణ మండపం అతి పెద్ద పెళ్లి మండపంగా పేరుగాంచింది. దీని పర్యవేక్షణ బాధ్యత స్నేహ చూసుకునేది. ఎప్పుడు ఏవో శుభ కార్యాలతో స్నేహ మహల్ కళకళ లాడుతూ ఉండేది. అక్కడ స్నేహాను చూసిన సినిమా వాళ్ళు ఆమెకు ఆఫర్స్ ఇచ్చారట.
ఇక అప్పటికే అప్పుడప్పుడు మోడలింగ్ కూడా చేస్తున్న స్నేహ ఇక వెండితెరపై అడుగుపెట్టి,ఓ మెరుపు మెరిసింది. ఆకట్టుకునే ముఖ వర్చస్సు,చెరగని చిరునవ్వుతో తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకున్న స్నేహ 1981అక్టోబర్ 12న జన్మించింది. చాలామంది స్మైలింగ్ బ్యూటీగా అభివర్ణిస్తారు. సంక్రాంతి, ఇక అసభ్యత అనేది దరిదాపుల్లోకి కూడా రాని నటిగా పేరుతెచ్చుకున్న స్నేహ సినిమాలు ఎలా ఎంచుకుందో జీవిత భాగస్వామిని కూడా అలానే ఎంచుకుంది.
కెరీర్ సాఫీగా సాగుతున్న సమయంలో దర్శకుడు,నటుడు అయిన ప్రసన్న ను ప్రేమించి పెళ్లి చేసుకుని, సినిమాలకు దూరమైంది. వీరికి విహాన్ అనే కొడుకు పుట్టాడు. తర్వాత కేరక్టర్ ఆర్టిస్టుగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. కూల్ ఇమేజ్ తో దక్షిణాదిన మంచి గుర్తింపు పొందిన హీరోయిన్ స్నేహ.
https://www.chaipakodi.com/