MoviesTollywood news in telugu

ఎన్టీఆర్ ‘అది’ సినిమాకి ఖర్చు – ఎన్ని కోట్ల లాభమో…షాక్ అవ్వాల్సిందే

Ntr Aadi Movie:యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మాస్ డైరెక్టర్ వి.వి. వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన ‘ఆది’ సినిమా వసూళ్లను చూస్తే షాక్ అవ్వాల్సిందే. బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ సినిమాలో కీర్తి చావ్లా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఎన్టీఆర్ కి స్టార్ డమ్ ని తెచ్చిపెట్టింది. ఈ సినిమాకి ముందు ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన ‘స్టూడెంట్ నెంబర్ 1’ హిట్ అయ్యిన ఎన్టీఆర్ కి పూర్తిగా మాస్ ఇమేజ్ రాలేదు. ఈ ‘ఆది’ సినిమాతో ఎన్టీఆర్ కి పూర్తిగా మాస్ ఇమేజ్ వచ్చేసింది. అంతేకాక ఈ సినిమా విడుదల అయ్యిన అన్ని చోట్ల దుమ్ము దులిపేసింది.ఈ సినిమా 3 సెంటర్స్ లో 175 రోజులు, 96 సెంటర్స్ లో 100 రోజులు, 121 సెంటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకొని దాదాపుగా 25 కోట్ల రుపాయిలను వసూలు చేసి టాలీవుడ్ లో రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకి బెల్లంకొండ సురేష్ కేవలం 2 కోట్లను మాత్రమే పెట్టుబడిగా పెట్టారు. ‘ఆది’ సినిమా 2 కోట్లు పెడితే 25 కోట్ల కనక వర్షాన్ని కురిపించింది. ఈ సినిమాకి తొడ కొట్టటం,గాల్లోకి సుమోలు లేవటం వంటి సన్నివేశాలు హైలెట్ గా నిలిచాయి.

https://www.chaipakodi.com/