Healthhealth tips in telugu

చిటికెడు ఇంగువ ఎంత మాయ చేస్తుందో చూడండి…అసలు నమ్మలేరు

Inguva Health Benefits In telugu : ఇంగువలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇంగువను పురాతన కాలం నుండి ఇంటి వైధ్యంగాను మరియు వంటల్లోనూ వాడుతున్నారు. కూరలో ఇంగువ వేస్తె చాలా రుచి వస్తుంది. అయితే కొంతమందికి ఇంగువ వాసన అసలు పడదు. కానీ ఇంగువ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. ఇంగువ మన శరీరంలో ఎన్నో మార్పులకు కారణం అవుతుంది.
Inguva Health benefits in telugu
ప్రతి రోజు ఇంగువ తీసుకుంటే గ్యాస్,కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గిపోతాయి. ఇంగువలో ఉండే యాంటీ బయాటిక్, యాంటీ వైరల్, యాంటీ ఇన్‌ప్లమేటరీ లక్షణాలు శ్వాస సమస్యలు లేకుండా చేస్తుంది. తలనొప్పిగా ఉన్నప్పుడు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో చిటికెడు ఇంగువ కలిపి తీసుకుంటే త్వరగా ఉపశమనం కలుగుతుంది.
Diabetes diet in telugu
ఇంగువ క్లోమంలో రక్తపు స్థాయిలను తగ్గిస్తుంది ..మధుమేహ వ్యాధి గ్రస్తులకు కాకరకాయలో కలిపి వండితే మంచి ప్రయోజనం ఉంటుంది. అలాగే బెల్లంతో ఇంగువను తీసుకుంటే మహిళలకు నెలసరి సమయంలో వచ్చే పొత్తి కడుపు నొప్పి తగ్గుతుందట.
Hing or asafoetida water benefits in telugu
ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో చిటికెడు ఇంగువ కలిపి తాగితే అజీర్ణ సమస్యలు, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గటమే కాకుండా అధిక ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్‌కు వ్యతిరేకంగా రక్షిస్తుంది. తక్కువ రక్తపోటుకు సహాయపడుతుంది. నరాలను ఉత్తేజపరచి నాడీ సంబంద సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది.
gas troble home remedies
మలబద్దకం సమస్య ఉన్నవారు రాత్రి పడుకోవటానికి అరగంట ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో చిటికెడు ఇంగువ కలిపి తాగితే ఆ సమస్య నుండి బయట పడవచ్చు. శరీరంలో రోగనిరోదక శక్తి పెరగటానికి కూడా సహాయపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/