15 రోజులు ఈ టీ తాగితే మీ పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు మంచులా కరిగిపోతుంది
How To Reduce Belly fat In telugu : ఈ రోజుల్లో అధిక బరువు అనేది ప్రతి ఒక్కరినీ వేదిస్తుంది. అధిక బరువు కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా బరువు తగ్గాలి. శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగించి బరువును తగ్గించటానికి Rose Tea బాగా సహాయపడుతుంది.
పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి గ్లాసున్నర నీటిని పోయాలి. దానిలో ఎర్ర గులాబీ రేకలను వేయాలి. తాజా గులాబీ పువ్వు అయితే గుప్పెడు రేకలను వేయాలి. ఎండిన పువ్వు అయితే రెండు పువ్వులను వేయాలి. ఆ తర్వాత రెండు యాలకులను చితక్కొట్టి వేసి పది నిమిషాల పాటు మరిగించాలి. ఎండిన పువ్వులను తీసుకుంటే ఈ టీ ఎరుపు రంగులో ఉంటుంది. తాజా పువ్వులను తీసుకుంటే గ్రే కలర్ లో ఉంటుంది.
ఈ టీని వడకట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు ప్రతి రోజు తాగితే 15 రోజుల్లోనే శరీరంలో కొవ్వు కరగటం ప్రారంభం అయ్యి బరువు తగ్గుతారు. ఈ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండుట వలన బరువు తగ్గటంలో సహాయపడుతుంది. తినాలనే కోరికను తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థ బరువు తగ్గటంలో సహాయపడుతుంది.
రోజ్ టీ జీర్ణవ్యవస్థలో మంచి బ్యాక్టీరియా పెరగడానికి సహాయపడుతుంది. అలాగే మలబద్దకం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. రోజ్ టీ డిటాక్స్ మరియు మూత్రవిసర్జన లక్షణాల వల్ల మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడుతుంది .విటమిన్ సి ఉండుట వలన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
సాదరణంగా ప్రతి ఇంటిలో గులాబీ మొక్కలు ఉంటాయి. కాబట్టి తాజా గులాబీ పువ్వులను వాడితే మంచిది…లేదంటే మార్కెట్ లో Dried Rose Petals లభ్యం అవుతాయి. Dried Rose Petals ని కూడా ఉపయోగించవచ్చు. బరువును ఆరోగ్యకరమైన రీతిలోనే తగ్గించుకోవాలి. ఈ టీ తాగితే బరువు తగ్గటమే కాకుండా ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలను పొందవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/