wheatgrass juice benefits:వారంలో 2 సార్లు ఈ జ్యూస్ తాగితే ఊహించని ప్రయోజనాలు
wheatgrass juice benefits:గోధుమ గడ్డిలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. గోధుమ గడ్డిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉన్నాయి. వారంలో రెండు సార్లు గోధుమ గడ్డి జ్యూస్ తాగితే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. గోధుమ గడ్డిలో విటమిన్-ఎ, బీ కాంప్లెక్స్, సీ, ఈ, కే విటమిన్లతో పాటు కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫైటోన్యూట్రియెంట్స్, 17 అమైనో యాసిడ్స్, క్లోరోఫిల్, ప్రోటీన్లు సమృద్దిగా ఉన్నాయి.
గోధుమ గడ్డిలోని క్లోరోఫిల్ శరీరంలో మలినాలు,విషాలను బయటకు పంపుతుంది. కాలేయం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. గోధుమ గడ్డిలో ఉండే ఎంజైమ్‌లు తీసుకున్న ఆహారం విచ్చిన్నం కావటానికి మరియు శరీరం పోషకాలను గ్రహించటానికి సహాయపడుతుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలను తగ్గించి జీర్ణ సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది.
ఈ జ్యూస్ తాగటం వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయదు. దాంతో బరువు తగ్గటానికి సహాయపడుతుంది. తినాలనే కోరికను తగ్గిస్తుంది. రక్తంలో ప్లేట్‌లెట్స్ సంఖ్యను పెంచటమే కాకుండా రక్త హీనత సమస్య లేకుండా చేస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. అంతేకాకుండా కీళ్ళనొప్పులు ఉన్నవారు వారంలో 3 సార్లు తాగితే గోధుమ గడ్డిలో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/