MoviesTollywood news in telugu

Rangabali OTT Release Date: నాగశౌర్య సినిమా.. నెల తిరక్కుండానే ఓటీటీలోకి స్ట్రీమింగ్ ఎందులో అంటే?

Rangabali OTT Release Date: నాగ‌శౌర్య రంగ‌బ‌లి మూవీ జూలై 7న ధియేటర్స్ లో విడుదల అయింది. ఈ సినిమా ట్రైల‌ర్స్‌, టీజ‌ర్స్‌తో పాటు డిఫ‌రెంట్ ప్ర‌మోష‌న్స్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించిన…విడుదల అయ్యాక అంచనాలను అందుకోలేకపోయింది. అందుకే విడుదల అయ్యి నెల రోజుల లోపే రంగ‌బ‌లి మూవీ ఓటీటీలోకి వచ్చేస్తుంది.

ల‌వ‌ర్‌బాయ్ ఇమేజ్‌కు భిన్నంగా మాస్ పాత్ర‌లో నాగ‌శౌర్య నటించాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా యుక్తి త‌రేజా నటించింది. అయితే ఈ సినిమా ఆగ‌స్ట్ 4 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో(Netflix) స్ట్రీమింగ్ కానుంది.