Chia seeds For Face:ఈ గింజలతో ఇలా చేస్తే ఎంతటి నల్లని ముఖం అయినా తెల్లగా కాంతివంతంగా మెరవటం ఖాయం
Chia Seeds Face Pack : ఈ మధ్య కాలంలో ఆడ,మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అందం పట్ల శ్రద్ద పెడుతున్నారు. కొంచెం శ్రద్ద పెడితే ఇంటిలోనే ముఖంను మెరిసేలా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ముఖం అందంగా, తెల్లగా మెరవాలని కోరుకుంటారు. దానికోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అయినా ఫలితం పెద్దగా రాక నిరాశ చెందుతూ ఉంటారు. అలాగే మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది.
అలా కాకుండా ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముఖం మీద నల్లని మచ్చలు, మొటిమలు, పిగ్మెంటేషన్ వంటి అన్నీ రకాల సమస్యలు తొలగిపోయి ముఖం తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది. ఈ చిట్కాకి ఉపయోగించే అన్నీ ఇంగ్రిడియన్స్ సులభంగా అందుబాటులో ఉండేవే.
ఒక కప్పులో ఒక స్పూన్ చియా గింజలను వేసి నీటిని పోసి రెండు గంటల పాటు నానబెట్టాలి. చిన్న బీట్రూట్ ముక్క తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేయాలి. అలాగే చిన్న బంగాళదుంప సగం ముక్కను తీసుకుని తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. మిక్సీ జార్లో నానిన చియా గింజలు, బీట్రూట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు వేసి మెత్తని పేస్ట్ గా తయారు చేయాలి. .
ఈ పేస్ట్ ని ఒక బౌల్ లోకి తీసుకొని అరచెక్క నిమ్మరసం పిండాలి. ముఖాన్ని శుభ్రం చేసుకుని తయారు చేసుకున్న పేస్ట్ ముఖానికి రాసి అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే ముఖం మీద మురికి,జిడ్డు,సన్ టాన్ ఇలా అన్ని రకాల సమస్యలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.
ఈ పేస్ట్ ని ఫ్రిజ్ లో పెడితే పది రోజులు వరకు నిల్వ ఉంటుంది. ఈ ప్యాక్ లో ఉపయోగించిన అన్నీ ఇంగ్రిడియన్స్ లో ఉన్న లక్షణాలు ముఖం తెల్లగా,కాంతివంతంగా మెరవటానికి సహాయపడతాయి. ముఖం తెల్లగా మెరవటానికి సహజసిద్దమైన పదార్ధాలతో చాలా సులభంగా ఇంటిలోనే ప్యాక్ తయారుచేసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/