Conjunctivitis: కండ్ల కలక వస్తే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. ఇంటి చిట్కాలు ఇవే
Home Remedies for Conjunctivitis: ప్రస్తుతం ఎక్కడ చూసిన కండ్ల కలక ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సీజన్ లో వర్షాల కారణంగా వాతావరణంలో జరిగే మార్పుల కారణంగా కంటికి ఇన్ ఫెక్షన్ వస్తుంది. ఈ ఇన్ ఫెక్షన్ రెండు మూడు రోజులలో తగ్గిపోతుంది. కండ్ల కలక వచ్చినప్పుడు అసలు కంగారు పడవలసిన అవసరం లేదు.
కండ్ల కలక వచ్చినప్పుడు కళ్ళు ఎర్ర పడటం,కంటి నిండా నీరు ఉండటం,దురద,నొప్పి వంటి లక్షణలు ఉంటాయి. కండ్ల కలక వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కండ్ల కలక అనేది ఒకరి నుండి మరొకరికి చాలా త్వరగా వ్యాపిస్తుంది. కండ్ల కలక వచ్చినప్పుడు సొంత వైద్యం చేసుకోకుండా డాక్టర్ దగ్గరకు వెళ్ళితే కంటిలో వేసుకొనే డ్రాప్స్ ఇస్తారు.
ఆ డ్రాప్స్ వేసుకుంటూ ఇప్పుడు చెప్పే జాగ్రత్తలను తీసుకుంటే సరిపోతుంది. కళ్ళను చేతితో తాకకుండా జాగ్రత్తగా ఉండాలి. చేతులలోని బ్యాక్టిరీయా ఈ సమస్యను మరింత పెంచే అవకాశముంది. మీ కళ్లను నీళ్లు చిమ్మరిస్తూ.. శుభ్రం చేసుకోండి. ఎక్కువగా మంచి నీటిని తాగాలి. అలాగే కళ్ళజోడు పెట్టుకోవాలి. కండ్ల కలక వచ్చినవారు ఒంటరిగా ఉంటే ఇతరులకు వ్యాప్తి తగ్గుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News