Digestive Relief Tips:గ్యాస్,కడుపు ఉబ్బరం, అసిడిటీతో ఇబ్బంది పడుతున్నారా…బెస్ట్ చిట్కా
Digestive Relief Tips:ప్రస్తుతం మారిన జీవనశైలి కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినటం వలన గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలను తగ్గించుకోవటానికి మన వంటింట్లో ఉండే కొన్ని పదార్థాలు చాలా బాగా సహాయపడతాయి. కాస్త ఓపికగా ఈ చిట్కాలను ఫాలో అయితే చాలా సులభంగా సమస్య నుండి బయట పడవచ్చు.
సోంపు గింజలు
మనలో చాలా మంది భోజనం తిన్న తర్వాత సోంపు గింజలను నోట్లో వేసుకుని నమ్ముతూ ఉంటారు. సోంపు గింజలలో ఉన్న పోషకాలు జీర్ణక్రియను మెరుగుపరచి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. దాంతో గ్యాస్,కడుపు ఉబ్బరం,అజీర్ణం వంటి సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.
అల్లం
చిన్న అల్లం ముక్కను నోట్లో వేసుకొని నమిలితే గ్యాస్,కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, జింగిబిన్ అనే డైజెస్టివ్ ఎంజైమ్ సమస్యను తగ్గించటానికి సహాయపడుతుంది.
బొప్పాయి
బొప్పాయిలో పాపైన్ అనే ఎంజైమ్ మరియు శోథ నిరోధక లక్షణాలు ఉండుట వలన పొట్టకు సంబందించిన అన్ని రకాల సమస్యలను తగ్గించటానికి సహాయ పడుతుంది. బొప్పాయిలో ఉండే ఎంజైమ్ తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణం కావడానికి ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News