Jabardasth:జబర్దస్త్ లో ఒక్కో ఎపిసోడ్ కి ఇంద్రజ రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటుందో తెలుసా…?
Jabardasth Show :జబర్దస్త్ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఆ షో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఈ షో లో జడ్జిగా రోజా స్థానంలో ఇప్పుడు ఇంద్రజ వస్తుంది. ఇంద్రజ ఒకప్పుడు టాప్ హీరొయిన్ గా ఉండేది. ఇప్పుడు ఇలా జబర్దస్త్ లోకి వచ్చి అభిమానులకు దగ్గర అయింది. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో జడ్జిగా వ్యవహరిస్తూ మంచి పేరు తెచ్చుకుంది.
అయితే జబర్దస్త్ లో ఒక్కో ఎపిసోడ్ కి ఇంద్రజ రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటుందో అనే విషయం గురించి చెప్పుకుంటే…ఇంద్రజ జబర్దస్త్ లో ఒక్కో ఎపిసోడ్ కి 2.5 లక్షల చొప్పున రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. ఇంద్రజతో పాటు కృష్ణ భగవాన్ కూడా జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఇతనికి కూడా 2.5 లక్షలు రెమ్యూనరేషన్ ఇస్తున్నారట. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు వీరికి ఇచ్చే రెమ్యూనరేషన్ చాలా తక్కువ అని చెప్పవచ్చు.
జబర్దస్త్ లో రోజా,నాగబాబు ఉన్నప్పుడు వారు ఒక్కో ఎపిసోడ్ కి 5 లక్షల వరకు తీసుకొనేవారు. వీరితో పోలిస్తే ఇంద్రజ,కృష్ణ భగవాన్ కి ఇచ్చే రెమ్యూనరేషన్ చాలా తక్కువ. ఇంద్రజ సినిమాల్లో మంచి పాత్ర వస్తే చేస్తుంది. ఇంద్రజ సినిమాలలో కన్నా బుల్లితెర షోలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంది. సినిమాల్లో కన్నా బుల్లితెర షోలకి ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకుంటుంది ఇంద్రజ.
Click Here To Follow Chaipakodi On Google News