Apricots Health Benefits:ఈ పండును ఎప్పుడైనా తిన్నారా…మీ గుండె, లివర్ భద్రం.. !
Apricots Health Benefits:కొద్దిగా ఎరుపు మరియు ఎక్కువగా పసుపు రంగు కలిగిన ఈ పండులో ఎన్నో ఊహించని ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పండు ఒకప్పుడు చాలా అరుదుగా లభించేది. కానీ ఇప్పుడు చాలా Dry రూపంలో చాలా విరివిగా లభిస్తోంది. ప్రతి రోజు ఒక పండు తింటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. గుండె,లివర్ ఆరోగ్యంగా ఉంచటానికి సహాయపడుతుంది.
విటమిన్ ఎ మరియు విటమిన్ ఇ సమృద్దిగా ఉండుట వలన కంటి చూపు మెరుగుదలకు సహాయపడటమే కాకుండా కంటి నరాలు బలహీనంగా మారకుండా చేస్తుంది. ఈ పండును ఎక్కువగా బ్యూటీ ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. ఈ పండులో అనేక రకాల యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి అతినీలలోహిత కిరణాల ప్రభావం నుండి చర్మాన్ని రక్షిస్తాయి. ఇది చర్మంలో ఫ్రీ రాడికల్స్ ఏర్పడకుండా చేస్తుంది.
కాలేయాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తుంది. కాలేయం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. కాలేయంలో వాపును ప్రోత్సహించే ఎంజైమ్‌ల స్థాయిలను తగ్గిస్తుందని ఇటివల జరిగిన పరిశోదనలో తేలింది. ఈ పండులో క్లోర్జెనిక్ యాసిడ్, కాటెచిన్ మరియు క్లారాసిటిన్ అనే సమ్మేళనాలు ఉండుట వలన గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. పైబర్ సమృద్దిగా ఉండుట వలన జీర్ణ సమస్యలు లేకుండా చేస్తుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News