Dates : ఖర్జూరాలను ఎప్పుడు పడితే అప్పుడు కాదు.. ఈ సమయంలో తింటే.. ఎక్కువ లాభం కలుగుతుంది..!
Dates Health Benfits: Dates లో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఖర్జూరంలో ఐరన్, ఫోలేట్, ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ B6 వంటివి సమృద్దిగా ఉంటాయి. మనలో చాలా మంది ఖర్జూరంను ఉదయం పరగడుపున తింటూ ఉంటారు. కొంత మంది ఏ సమయంలో తినాలో తెలియక ఆకలి వేసినప్పుడు తింటూ ఉంటారు.
అయితే ఖర్జూరంను ఉఅదయం సమయంలో తింటే మంచిది. రోజుకి మూడు లేదా నాలుగు ఖర్జురాలను మించి తినకూడదు. ఉదయం సమయంలో తీసుకుంటే కలిగే లాభాల గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఉదయం సమయంలో తినటం వలన శరీరానికి అవసరమైన శక్తి అంది అలసట,నీరసం వంటివి లేకుండా హుషారుగా ఉంటారు.
అంతేకాకుండా ఉదయం సమయంలో తీసుకోవటం వలన కడుపులో పురుగులు నశిస్తాయి. శరీరంలో కీలకమైన అవయవాలను శుభ్రం చేస్తుంది. గుండె మరియు కాలేయం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. యాంటీఆక్సిడెంట్ సమృద్దిగా ఉండుట వలన చర్మం యవ్వనంగా ఉంటుంది. అలాగే జుట్టు మెరుస్తుంది. ఖర్జూరంలో ఫ్లేవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, ఫినాలిక్ యాసిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి.
ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచటమే కాకుండా మెదడుకు అవసరమైన పోషకాలను అందించి మెదడును ఆరోగ్యంగా ఉంచటమే కాకుండా అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. అయితే డయాబెటిస్ ఉన్నవారు రోజుకి రెండు ఖర్జూరాలకు మించి తీసుకోకూడదు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News