Healthhealth tips in telugu

Kuppintaku For Joint Pain :కోట్లు విలువ చేసే ఈ ఆకు ఎక్కడైనా కనిపిస్తే అసలు వదలద్దు

Kuppintaku For Joint Pain : మన ఇంటి చుట్టు పక్కల ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి. వాటిల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. మనకు ఎన్నో రకాల మొక్కలు కనిపించినా… అవి పిచ్చి మొక్కలుగా భావించి వాటిని పెద్దగా పట్టించుకోము. అలాంటి మొక్కలలో కుప్పింటాకు మొక్క ఒకటి. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి.

ఆయుర్వేదంలో ఎక్కువగా ఈ మొక్కను వాడుతూ ఉంటారు. గజ్జి, తామర, దురదలు, దద్దుర్లు వంటి ఏటువంటి చర్మ సమస్యకు అయినా ఈ కుప్పింటాకు చాలా బాగా పనిచేస్తుంది. కుప్పింటాకులను తీసుకొని శుభ్రంగా కడిగి మెత్తని పేస్ట్ గా చేసి చర్మ సమస్యలు ఉన్న ప్రదేశంలో రాసి పది నిమిషాలు అయ్యాక శుభ్రంగా కడిగితే సరిపోతుంది. నాలుగు నుంచి ఐదు రోజులు ఈ విధంగా చేస్తే చర్మ సమస్యలన్నీ తొలగిపోతాయి.

కీళ్ల నొప్పులు ఉన్నవారికి ఈ ఆకు చాలా బాగా సహాయపడుతుంది. కుప్పింటాకు ఆకులను, వెల్లుల్లి రెబ్బలను, మిరియాలను కలిపి మెత్తగా నూరాలి. ఈ మిశ్రమంను నువ్వుల నూనెలో వేసి బాగా మరిగించి ఆ నూనెను వడగట్టి నిలువ చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న నూనెను నొప్పులు ఉన్న ప్రదేశంలో రాసి రెండు నిమిషాల పాటు మసాజ్ చేస్తే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.

ఈ విధంగా రోజు చేస్తూ ఉంటె నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ మొక్క ఆకుల‌ను మెత్త‌గా చేసి అందులో కొద్దిగా ప‌సుపును క‌లిపి ముఖానికి రాసి 15 నిమిషాల త‌రువాత చ‌ల్ల‌టి నీటితో క‌డిగేయ‌డం వ‌ల్ల ముఖంపై ఉండే మ‌చ్చ‌లు, మొటిమ‌లు త‌గ్గి ముఖం కాంతివంతంగా మారుతుంది. ముఖంపై ఉండే అవాంఛిత రోమాలు కూడా తొల‌గిపోతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Click Here To Follow Chaipakodi On Google News