Healthhealth tips in telugu

Diabetes:గ్లాసు తాగితే 30 ఏళ్ల నుండి షుగర్ ఉన్నా,380 లేదా 480 ఉన్నా 7 రోజుల్లో మాయం అవుతుంది

Diabetes: మారిన జీవనశైలి పరిస్థితి కారణంగా ఈ మధ్య కాలంలో చాలా చిన్న వయస్సులోనే డయాబెటిస్ అనేది వచ్చేస్తుంది. డయాబెటిస్ రాగానే అసలు కంగారు పడవలసిన అవసరం లేదు. డాక్టర్ చెప్పిన మందులను వాడుతూ ఇప్పుడు చెప్పే డ్రింక్స్ ని ఉదయం పరగడుపున,రాత్రి పడుకోవటానికి ముందు తాగితే సరిపోతుంది.

బెండకాయ డయాబెటిస్ నియంత్రణలో సహాయపడుతుంది. రెండు బెండకాయలను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. రాత్రి సమయంలో ఒక గ్లాసు లో నీటిని పోసి దానిలో బెండకాయ ముక్కలను వేసి మూత పెట్టి అలా వదిలేయాలి. మరుసటి రోజు ఉదయం నీటిని వడకట్టి పరగడుపున తాగాలి. ఈ విధంగా ప్రతి రోజు తాగాలి.

రాత్రి పడుకొనే ముందు ఇప్పుడు చెప్పే డ్రింక్ తాగాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి అరస్పూన్ మెంతులు, రెండు రెబ్బల కరివేపాకు,పవుస్పూన్ పసుపు, అంగుళం దాల్చిన చెక్క ముక్క వేసి 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగించాలి. ఈ నీటిని వడకట్టి రాత్రి పడుకొనే ముందు తాగాలి. ఉదయం బెండకాయ నీటిని, రాత్రి సమయంలో ఈ డ్రింక్ తాగితే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.

ఇలా చేయటం వలన డయాబెటిస్ నియంత్రణలో ఉండటమే కాకుండా డయాబెటిస్ కారణంగా వచ్చే సమస్యలు కూడా ఉండవు. అలాగే అధిక బరువు సమస్యతో బాధపడే వారికీ కూడా చాలా బాగా సహాయపడుతుంది. శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. కాబట్టి కాస్త ఓపిక చేసుకొని తాగి డయాబెటిస్ ని నియంత్రణలో ఉంచుకోండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Click Here To Follow Chaipakodi On Google News