Healthhealth tips in telugu

Raisins with Milk:పాలలో వీటిని వేసి మ‌రిగించి తాగండి.. కీళ్ల నొప్పులు ఉండ‌వు..!

Raisins with Milk:మనలో చాలా మంది ప్రతి రోజు ఎదో ఒక సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవటం అలవాటుగా చేసుకోవాలి. నీర‌సం, బ‌ల‌హీన‌త‌, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వంటి సమస్యలను తగ్గించటానికి ఇప్పుడు చెప్పే చిట్కా చాలా బాగా సహాయపడుతుంది.

పాలలో నల్ల ఎండు ద్రాక్ష ఉడికించి తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. నల్ల ఎండు ద్రాక్షను మామూలుగా తినటం కన్నా పాలల్లో ఉడికించి తింటే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. నల్ల ఎండుద్రాక్ష అయితే చాలా మంచిది. శ‌రీరానికి త‌గినంత క్యాల్షియం ల‌భిస్తుంది. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.

దీనిలో కరగనీ మరియు కరిగే ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన ప్రేగు కదలికలు సాఫీగా జరగడానికి సహాయపడి మలబద్ధకం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. ఈ మధ్య కాలంలో చాలా మంది మలబద్ధకం సమస్యతో బాధ పడుతున్నారు. అలాంటి వారు పాలల్లో ఉడికించిన నల్ల ఎండు ద్రాక్ష తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
black raisins
గుండె ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. దీనిలో ఫైబర్ పొటాషియం,ఫినాల్స్ వంటి బయో యాక్టివ్ సమ్మేళనాలు ఉండటం వలన గుండెకు ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంచుతుంది. యాంటి మైక్రోబియల్ లక్షణాలు ఉండటం వలన అలాగే ఫైటో కెమికల్ యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వలన పంటికి సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది.

కావిటిస్ కి కారణమయ్యే బ్యాక్టీరియా పెరుగుదలను అణిచివేస్తుంది. అంతేకాకుండా ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి కీళ్ల నొప్పులు, మోకాలి నొప్పులు వంటి అన్ని రకాల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది. ఒక గ్లాసు పాలలో 5 నల్ల ఎండు ద్రాక్షను వేసి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు ఉడికించాలి. ఉడికిన ఎండు ద్రాక్షను నములుతూ పాలను తాగాలి.
sleeping problems in telugu
ఈ పాలను ఉదయం లేదా రాత్రి పడుకునే ముందు తాగవచ్చు. ఉదయం సమయంలో తీసుకుంటే అలసట,నీరసం,నిస్సత్తువ వంటివి లేకుండా రోజంతా హుషారుగా ఉంటారు. రాత్రి సమయంలో తీసుకుంటే ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా నిద్ర పడుతుంది. శారీరక బలహీనత లేకుండా చేస్తుంది. రక్తహీనత సమస్య ఉన్నవారికి కూడా చాలా మంచి ఫలితాన్ని అందిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.