Healthhealth tips in telugu

Joint pains Diet:కీళ్ల నొప్పులు ఉన్నవారు పెరుగు తింటే ఏమి అవుతుందో…?

Joint pains Diet:ఒకప్పుడు కీళ్ళనొప్పులు అనేవి 60 సంవత్సరాలు వచ్చే సరికి వచ్చేవి. కానీ ప్రస్తుతం 30 సంవత్సరాలు వచ్చేసరికి వచ్చేస్తున్నాయి. కీళ్ళనొప్పులు ఉన్నప్పుడు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. ఒకవేళ తింటే నొప్పులు ఎక్కువ అవుతాయి. అయితే కీళ్ళనొప్పులు ఉన్నవారు పెరుగు తింటే ఏమి అవుతుందో తెలుసుకుందాం.

పెరుగు అనేది ప్రతి ఒక్కరు భోజనంలో ఇష్టపడి తింటూ ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే పెరుగు అన్నం లేకుండా భోజనం పూర్తి కాదు. పెరుగులో Calcium,పొటాషియం,మెగ్నీషియం,సోడియం, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, విటమిన్ బి, యాంటీ ఆక్సిడెంట్స్ వంటివి సమృద్ధిగా ఉంటాయి.
Joint Pains
పెరుగు లో ఉన్న పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అయితే పెరుగులో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా కీళ్ళ నొప్పులు ఉన్నవారు మాత్రం తినటం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజు పెరుగు తింటే నొప్పులు ఎక్కువ అవుతాయి. ఫ్రిజ్ లో పెట్టిన పెరుగు, పుల్లగా ఉన్న పెరుగు తింటే కీళ్ల నొప్పులు బాగా పెరుగుతాయి. ఈ విషయాన్నీ తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.
curd benefits in telugu
అయితే పెరుగు తినాలని అనుకునేవారు పెరుగుకు బదులుగా మజ్జిగ వాడవచ్చు. అయితే మజ్జిగలో బెల్లం కలుపుకుని తీసుకుంటే ఎముకలు, కండరాలు దృఢంగా మారి కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా నీరసం, అలసట వంటివి కూడా తొలగిపోతాయి. అధిక బరువు సమస్యతో బాధపడేవారు కూడా పెరుగుకు బదులుగా మజ్జిగ తీసుకుంటే మంచిది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News