Palm fruit idli:తాటి పండు తో చేసిన తాటి ఇడ్లీలు ఎప్పుడైనా తిన్నారా…ఒకసారి తింటే అసలు వదిలిపెట్టరు
Palm fruit idli:తాటి పండులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ సీజన్ లో చాలా విరివిగా లభ్యం అవుతాయి. తాటి పండు నుండి గుజ్జు తీసి ఎన్నో రకాల వంటలను చేసుకోవచ్చు. మనం ఉదయం సమయంలో ఇడ్లీ ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. అలా ఇడ్లీని తాటి పండు గుజ్జుతో చేస్తే చాలా రుచిగా ఉంటుంది. తాటి పండు ఇడ్లీ ఎలా తయారు చేయాలో చూద్దాం.
కావలసిన పదార్ధాలు
తాటి పండు ఒకటి
ఇడ్లీ రవ్వ పావుకేజి
బియ్యం రవ్వ రెండు స్పూన్స్
ఆవునెయ్యి రెండు స్పూన్లు
బెల్లం ఒక కప్పు
కొబ్బరి ఒక కప్పు
యాలకులు అయిదు
ఉప్పు రుచికి సరిపడా
తయారి విధానం
ముందుగా తాటిపండు నుండి గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ గుజ్జులో పీచు లేకుండా చూసుకోవాలి. ఇడ్లీ రవ్వ లో నీటిని పోసి గంట నానబెట్టాలి. ఒక తాటి పండుకు కప్పున్నర గుజ్జు వస్తుంది. ఒక బౌల్ లో తాటి పండు గుజ్జు, ఇడ్లీ రవ్వ,బియ్యం రవ్వ,బెల్లం, ఆవు నెయ్యి,కొబ్బరి,యలకులు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి ఒక గంట అలా వదిలేయాలి.
గంట తర్వాత మనం ఇడ్లీ ఎలా వేసుకుంటామో అదే విధంగా ఈ పిండితో ఇడ్లీలు వేసుకోవాలి. మాములు ఇడ్లి కన్నా ఈ ఇడ్లీ ఉడకటానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. కానీ రుచి మాత్రం చాలా బాగుంటుంది. ఎన్నో పోషక విలువలు ఉన్న తాటి పండు ఇడ్లీని తినండి.
Click Here To Follow Chaipakodi On Google News