Health Tips:నిత్య జీవితంలో అందరికి ఉపయోగపడే ఆరోగ్య చిట్కాలు
Telugu Health Tips:ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని ఎన్నో రకాల ఆరోగ్య చిట్కాలను పాటిస్తూ ఉంటారు. ఎవరైనా చెప్పినవి…లేదంటే ఎక్కడైనా చదివినవి…లేదంటే ఎక్కడైనా చూసినవి పాటిస్తూ ఉంటారు. ఇలా పాటించటం వలన ఆరోగ్యం చాలా బాగుంటుంది. అందరికి ఉపయోగపడే కొన్ని ఆరోగ్య చిట్కాలను తెలుసుకుందాం.
కాలిన మచ్చలకి తేనె రాస్తే మచ్చలు అన్నీ కూడా సులభంగా పోతాయి.
కాళ్లు, చేతులు బెణికితే ఉప్పుతో కాపడం పెడితే ఉపశమనంగా ఉంటుంది.
కడుపు నొప్పిగా ఉన్నప్పుడు గోరువెచ్చని నీటిలో యాలకుల పొడి కలిపి తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది.
అరటి పండులో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. అనీమియా ను అరికడుతుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
రక్తహీనతతో బాధపడేవారు టీ, కాఫీలలో పంచదారకు బదులుగా తేనెను ఉపయోగిస్తే రక్తం వృద్ధి అవడంతో పాటు రక్తం శుద్ధి అవుతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
Click Here To Follow Chaipakodi On Google News